Pawan Kalyan: రామయ్యను చూడగానే కన్నీళ్లాగలేదు
Pawan Kalyan: అయోధ్య రామమందిరంలో (ayodhya ram mandir) రామచంద్రమూర్తి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది కోట్లాది భారతీయుల కల అని.. రామయ్య విగ్రహాన్ని చూడగానే తనకు కన్నీళ్లు ఆగలేదని తెలిపారు. ఇది తనకు భావోద్వేగంతో కూడుకున్న రోజని.. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోట్లాది మంది భారతీయులను ఒక దగ్గర చేర్చిందని అభిప్రాయపడ్డారు.