Pawan Kalyan: జగన్పై దాడి.. వారిని ఎందుకు వెతుకుతున్నారు?
Pawan Kalyan: జగన్ మోహన్ రెడ్డిపై (Jagan Mohan Reddy) మొన్న శనివారం విజయవాడలో రాళ్లు రువ్విన ఘటనపై స్పందించారు జనసేనాని పవన్ కళ్యాణ్ ఇది పూర్తిగా భద్రతా వైఫల్యం అని.. భద్రత కల్పించాల్సిన వారిపై చర్యలు తీసుకోకుండా రాళ్లు రువ్విన వారిని వెతికి పట్టుకోవడం ఏంటని పవన్ ప్రశ్నించారు.
“” జగన్ లాంటి వీవీఐపీపై రాళ్ల దాడి జరిగిందంటే అది ముమ్మాటికీ రాష్ట్ర డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ పోలీస్ కమిషనర్ భద్రతా వైఫల్యం. వారు ఎందుకు వారి డ్యూటీని సక్రమంగా చేయలేదు అని ప్రశ్నించాల్సిందిపోయి రాళ్లు రువ్విన వారిని వెతికి పట్టుకోవడం ఏంటి? గతంలో విజయవాడకు సీఎం వస్తున్నారంటే పరదాలు, కర్టెన్లు కట్టుకుని వచ్చేవారు. ఒక్క చెట్టుని కూడా వదిలేవారు కాదు. జగన్ లాంటి వీవీఐపీకి 24 గంటలూ సెక్యూరిటీ ఉంటుంది. అలాంటి వ్యక్తి సభలో పాల్గొంటే కరెంట్ పోవడం ఏంటి? అంటే జగన్ సెక్యూరిటీ అంత వీకా?
పోయిన సారి ప్రధాని నరేంద్ర మోదీ వచ్చినప్పుడ కూడా భద్రతా వైఫల్య ఘటన జరిగింది. ఇలా వీవీఐపీలకు భద్రత ఇవ్వలేని పోలీసులను వెంటనే బదిలీ చేయాలి. వారి వైఫల్యంపై కఠిన విచారణ చేపట్టాలి. ఆ తర్వాత ఈ రాళ్లు రువ్వినవారిపై కఠిన చర్యలు తీసుకునేలా నిజాయతీ గల పోలీసు అధికారులను నియమించాలి. రాష్ట్రంలో సక్రమంగా ఎన్నికలు జరగాలంటే కేంద్ర ఎన్నికల కమిషన్ క్షేత్రస్థాయిలో అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను “” అని ప్రశ్నించారు పవన్