AP Assembly Results: ఇలా రిజ‌ల్ట్.. అలా కొత్త పోస్ట‌ర్లు

pawan kalyan new film posters are ready to release ahead of AP Assembly Results

AP Assembly Results: ఈరోజు సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి. మ‌రీ ముఖ్యంగా తెలుగు వారి చూపు ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలపై ఉంది అన‌డంలో ఏమాత్రం సందేహం లేదు. ఈరోజు మ‌ధ్యాహ్నానికి గెలుపు ఎవ‌రిదో తెలిసిపోతుంది. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం రిజల్ట్ రాగానే.. ఆయ‌న న‌టిస్తున్న సినిమాల‌కు సంబంధించిన కొత్త పోస్ట‌ర్లు రిలీజ్ చేసేందుకు నిర్మాణ సంస్థ‌లు సిద్ధం అయిపోయాయి. సాధార‌ణ రోజుల్లో రిలీజ్ చేసే పోస్ట‌ర్ల కంటే ఈరోజు గెలుపు ఫ‌లితం చూసాక రిలీజ్ చేస్తే వ‌చ్చే కిక్కే వేరు అని నిర్మాణ సంస్థ‌లు అనుకుంటున్నాయ‌ట‌.