Janasena: ద…త్త..పుత్రడు..!
నువ్వెంత నీ బతుకెంత జగన్ (jagan) ఎంత అని మండిపడ్డారు జనసేనాని పవన్ కళ్యాణ్ (janasena). BJPతో పొత్తు పెట్టుకున్నంత మాత్రాన వారు చెప్పినవాటికి అన్నింటికీ తల ఊపనక్కర్లేదని అన్నారు. ఈ విషయం BJP నేతలే తనతో చెప్పారని తెలిపారు. అసలు జగన్‌కి ఎందుకు భయపడాలని ప్రశ్నించారు.
“” జగన్‌ని పూర్తిగా చదివాను నేను. అతనికి మానసిక సమస్య ఉంది. నాకు ఇప్పటికీ అనిపిస్తుంటుంది… ఢిల్లీలోని ఎయిమ్స్ నుంచి వైద్యులను పిలిపించి అతనికి పరీక్షలు చేయిద్దామా అనిపిస్తుంటుంది. నాకు మద్దతుదారులపై ఎలాంటి కోపం లేదు. వారికి తెలీడంలేదు జగన్ ఎలాంటివాడు అని. తెలిసినరోజు వారికీ అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు దక్షిణ ఇండియాలోనే జాతీయ స్థాయిలో భద్రత ఉన్న ఏకైక నాయకుడు. అలాంటి ఆయన బయటికి వెళ్లేటప్పుడు మామూలుగానే వెళ్తున్నాడు. కానీ జగన్‌కు ఎవరి నుంచి ప్రాణహాని ఉంది? అతనెందుకు పరదాలు కట్టుకుని మరీ వెళ్తున్నాడో ఆయనకే తెలియాలి.
ఎప్పుడూ కూడా ప్రతిపక్షాలను తక్కువ చేసి చూడకూడదు. తక్కువ చేసి చూస్తే వారు మరింత బలపడతారు. ఈరోజు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నారంటే ఇది ఆయనకు తాత్కాలిక కష్టకాలం మాత్రమే. జగన్ కూడా జైల్లో ఉండి వచ్చినవాడే. జగన్‌ను గద్దె దించడం పెద్ద కష్టమేమీ కాదు. అతను కూడా మనలాంటి మనిషే. YSRCP నాయకురాలా.. మీరు అవినీతికి పాల్పడండి.. ఇంకేమైనా చేసుకోండి. నేను వచ్చే ఎన్నికల్లో కావాల్సిన సీట్లు గెలిచి కచ్చితంగా అసెంబ్లీలోకి అడుగుపెడతాను. కచ్చితంగా నేను నా ఏపీని మీ నుంచి కాపాడుకుంటాను.
సింహం సింగిల్‌గా వస్తుంది అని మీరు తొడలు కొట్టుకుంటే మీకే వాచిపోతది. నేను సినిమాలో సింహం గెడ్డం తీసుకోదు అనే డైలాగ్ చెప్పడానికే నేను ఎంతో కష్టపడ్డాను. ఈరోజు చెప్తున్నాను.. వైసీపీ ఓడిపోతుంది. ఇప్పటికీ జగన్ ఏదైనా పబ్లిక్ మీటింగ్‌లో మాట్లాడాలంటే.. జగన్ పేపర్ పట్టుకుని ఎలా చదవాలో అర్థంకాక ద..త్త.. పుత్రుడు అని పలుకుతాడు. మేం విసిగిపోయాం. మీకు గొడవే కావాలనుకుంటే నేనేం చేయలేను. నేను ఏ స్థాయిలో గొడవ పెట్టుకోగలనో మీరు చూసారు. జనసేన, తెలుగు దేశం, బీజేపీ ఆశీస్సులు ఉన్న జనసేకు ప్రజలు మద్దతు ఇస్తారని కోరుకుంటున్నాను “” అని తెలిపారు పవన్ (pawan kalyan)