AP Elections: 4 నియోజకవర్గాలపై పవన్ ఫోకస్
AP Elections: ఈ ఏడాదిలో జరగబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ (pawan kalyan) ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే అంశం చర్చనీయాంశంగా మారింది. 2019 ఎన్నికల సమయంలో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసి రెండు చోట్ల నుంచి ఓడిపోయారు. దాంతో ఇప్పుడు రాబోతున్న ఎన్నికల్లో పవన్ ఎమ్మెల్యేగా గెలవడమే జనసేనకు ప్రతిష్ఠాత్మక అంశంగా మారింది. 2019తో పోలిస్తే ఈసారి జనసేన కాస్త పుంజుకోబోతోందనే తెలుస్తోంది. అందులోనూ తెలుగు దేశం పార్టీతో (TDP) పొత్తులోనూ ఉంది. సో ఈసారి ఏది ఏమైనా పవన్ ఎమ్మెల్యేగా గెలిచి తీరాల్సిందే అన్న పట్టుదలతో ఉన్నారు.
ఇక పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే అంశంపై క్షేత్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికైతే నాలుగు నియోజకవర్గాల పేర్లు వినిపిస్తున్నాయి. తిరుపతి, భీమవరం, పిఠాపురం, విజయవాడ నియోజకవర్గాల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. ముందే తాను ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నానో చెప్పేస్తే తనను ఓడించడానికి YSRCP అన్ని శక్తులను ఉపయోగిస్తుందని ఈ విషయం గోప్యంగా ఉంచారు.