TDP Janasena: జెండా దించు.. ప‌వ‌న్ ఫైర్

TDP Janasena: తాడేప‌ల్లిగూడెంలో జ‌న తెలుగు జెండా పేరుతో తెలుగు దేశం, జ‌న‌సేన పార్టీలు భారీ బ‌హిరంగ స‌భ ఏర్పాటుచేసింది. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) ప్ర‌సంగిస్తూ త‌న ఎదురుగా ఉన్న అభిమానిపై కేక‌లు వేసారు. ప‌వ‌న్ ప్ర‌సంగాల స‌మ‌యంలో ఊగిపోతూ మాట్లాడుతుంటారు. అందులో ఆంధ్ర‌ప్రదేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (Jagan Mohan Reddy) గురించి మాట్లాడే స‌మ‌యంలో ఇక ఆయ‌న ఆవేశాన్ని ఆప‌డం ఎవ‌రి త‌రం కాదు. అలాంటి ఆయ‌న జ‌గ‌న్ గురించి మాట్లాడుతుండ‌గా… ఆయన ఎదురుగా లైన్‌లో నిల‌బ‌డి ఉన్న ఓ అభిమాని జ‌న‌సేన‌, తెలుగు దేశం పార్టీ లోగోలు ఉన్న భారీ జెండాను ఊపాడు. దాంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు చిర్రెత్తుకొచ్చింది. జెండా దించు జెండా దించు అని కేక‌లు వేసారు. (TDP Janasena)