Pawan Kalyan: CI అంజూ యాదవ్‌పై జనసేనాని ఫిర్యాదు
Tirupati: జనసేనాని పవన్ కళ్యాణ్ (pawan kalyan) సీఐ అంజూ యాదవ్ (ci anju yadav) అరాచకాలపై ఫిర్యాదు చేసేందుకు తిరుపతి వెళ్లారు. తిరుపతి ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న పవన్ ఇంకాసేపట్లో కంప్లైంట్ రాయనున్నారు. కొన్ని రోజుల క్రితం జనసేన (janasena) కార్యకర్తపై అంజూ యాదవ్ చెయ్యి చేసుకున్నారు. ఓ మహిళను నడి రోడ్డుపై చీర విప్పి నానా హంగామా చేస్తున్న వీడియో కూడా ఒకటి బయటికి వచ్చింది. దాంతో అంజూ యాదవ్ (ci anju yadav) YSRCP ప్రభుత్వం ఆడించినట్లు ఆడుతోందని జనసేన విమర్శించింది. ఆమెపై తగిన చర్యలు తీసుకుని సస్పెండ్ చేసేవరకు విడిచి పెట్టకూడదని జనసేన కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.