Janasena: చూస్కోవాలి కదా BRO..!
Hyderabad: అసలే ఎన్నికల సమయం. అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు ఆచి తూచి వ్యవహరించాల్సిన సమయం. ఇప్పుడు ఏపీ ఎన్నికల విషయానికొస్తే.. అధికార పార్టీ YCPని ఎలాగైనా దించేయాలని TDP, జనసేన (janasena) తీవ్రంగా కృషిచేస్తున్నాయి. ఇందుకోసం పొత్తు పెట్టుకోవడానికి కూడా వెనుకాడలేదు. ఓపక్క TDP నుంచి నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. మరోపక్క జనసేనాని పవన్ కళ్యాణ్ (pawan kalyan) వారాహి యాత్రతో ఉభయ గోదావరి జిల్లాల్లో వరుస ప్రచారాలతో బిజీగా ఉన్నారు.
అయితే రెండు రోజుల క్రితం పవన్ కాస్త అనారోగ్యానికి గురయ్యారు. దాంతో కొన్ని గంటల పాటు రెస్ట్ తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. నిన్న పవన్ బ్రో (bro) సినిమాకు డబ్బింగ్ చెప్తున్న వీడియోలు, ఫొటోలను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వారు పోస్ట్ చేయడంలో తప్పు లేదు. ఎందుకంటే అది వారి సినిమా.. ఆడియన్స్‌లో హైప్ క్రియేట్ చేయడం కోసం అలా చేసారు.
కానీ ఇప్పుడు ఇదే విషయం YCP ఆయుధంగా వాడుతోంది. మొన్న జ్వరం వచ్చిందని చెప్పి గ్యాప్ తీసుకున్నది బ్రో (bro) సినిమాకు డబ్బింగ్ చెప్పడం కోసమే అంటూ పలువురు YCP సపోర్టర్లు విమర్శిస్తున్నారు. అంత జ్వరం ఉన్నప్పుడు డబ్బింగ్ చెప్పడానికి ఎలా వెళ్లారంటూ ప్రశ్నిస్తున్నారు. కనీసం ఎన్నికలు అయ్యేవరకు ఇలాంటి ఫొటోలు, వీడియోలు బయటికి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పవన్‌దే. ఒక్కమాట పవన్ చెప్తే ఇవేవీ బయటికి రాకుండా ఉంటాయి. ఎటూ పవన్ సినిమా వస్తుందంటే హైప్ ఆల్రెడీ ఉంటుంది. అలాంటప్పుడు ఈ సమయంలో పవన్ కేవలం ఎన్నికలు, ప్రచారాలపైనే ఫోకస్ చేస్తే బాగుంటుంది.