Pawan Kalyan: డిక్ల‌రేష‌న్ ఇచ్చిన ప‌వ‌న్ కూతురు

pawan kalyan daughter give declaration

Pawan Kalyan: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ చిన్న కూతురు పోలెనా అంజ‌నా తిరుమ‌ల ద‌ర్శ‌నానికి డిక్ల‌రేష‌న్ ఇచ్చారు.
టిటిడి ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై పోలెనా సంతకాలు చేశారు. పోలెనా మైనర్ కావ‌డంతో తండ్రిగా పవన్ కళ్యాణ్ ఆ పత్రాలపై సంతకాలు చేయాల్సి వ‌చ్చింది. తిరుమ‌ల శ్రీవారిని అన్య మ‌త‌స్థులు ద‌ర్శించుకోవాలంటే డిక్ల‌రేష‌న్‌పై సంత‌కం చేయాల్సిందేన‌న్న రూల్ ఉంది. ఈ విష‌యంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వెనుక‌డుగు వేయ‌డంతో డిక్ల‌రేష‌న్‌పై సంత‌కం చేయ‌డానికి ఎవ్వ‌రూ అతీతులు కారు అని తెలియ‌జేసేందుకు ప‌వ‌న్ త‌న కూతురి చేత సంత‌కం చేయించాల‌నుకున్నారు.