జ‌న‌సేన‌కు ఓటేయ‌లేక‌పోయిన ప‌వ‌న్.. ఎందుకు మిస్ చేసుకున్నారు?

Pawan Kalyan couldn't vote for himself

Pawan Kalyan: జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌కి తాను ఓటు వేసుకోలేక‌పోయారు. ఈసారి ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ పిఠాపురం నుంచి పోటీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈసారి ఎలాగైనా ల‌క్ష మెజారిటీతో గెల‌వాని.. త‌నను అసెంబ్లీకి పంపించాల‌ని పిఠాపురం ప్ర‌జ‌ల‌ను వేడుకున్నారు. కానీ త‌న ఓటును మాత్రం తెలుగు దేశం పార్టీ జాతీయ సెక్ర‌ట‌రీ నారా లోకేష్‌కు వేయాల్సి వ‌చ్చింది.

ప‌వ‌న్‌కు ఓటు మంగ‌ళ‌గిరిలో ఉంది. ఇందుకోసం ఆయ‌న ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో త‌న భార్య ఆన్నాతో క‌లిసి ఓటు వేసేందుకు వెళ్లారు. పిఠాపురంలోనే ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటాను అని ఏకంగా ఇల్లు కూడా తీసుకున్న ప‌వ‌న్.. త‌న ఓటును పిఠాపురానికి బ‌దిలీ చేసుకోలేక‌పోవ‌డం ఏంటో ఆయ‌న‌కే తెలియాలి. ఈ చిన్న ప‌నిని ఆయ‌న కూడా చేయ‌న‌క్క‌ర్లేదు. త‌న కార్య‌క‌ర్త‌ల‌కు చెప్తే నిమిషాల్లో త‌న ఓటును పిఠాపురానికి బదిలీ చేయించుకోవ‌చ్చు. ఇలా త‌న నియోజ‌క‌వ‌ర్గంలో తన‌కి తానే ఓటేసుకోలేక‌పోయాడు అంటూ విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.