Pawan Kalyan: అందుకే BRSని ఏమీ అనలేకపోతున్నాను
Telangana Elections: తెలంగాణ ఎన్నికల్లో జనసేన (janasena) BJPతో కలిసి పొత్తు పెట్టుకుని ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు పవన్ (pawan kalyan) కొత్తగూడెంలో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణలో ప్రచారం చేసేటప్పుడు ఎందుకు అధికార పార్టీని (BRS) వేలెత్తి చూపడంలేదు అని అడుగుతున్నారని.. అలా మాట్లాడాలంటే తెలంగాణ మొత్తం తిరిగితే సమస్యలు తెలిసినప్పుడు మాట్లాడతానని అన్నారు. ఏదో మాట్లాడాలి కాబట్టి ఊరికే పార్టీలపై నోరు పారేసుకోనని చెప్పారు.
స్నేహం వేరు బాధ్యత వేరు
తెలంగాణ నేతలైన KCR, KTR రేవంత్ రెడ్డి, వీహెచ్ హనుమంతరావు ఇలా చాలా మంది నేతలతో తనకు స్నేహం ఉన్నప్పటికీ.. తన మద్దతు మాత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మాత్రమేనని పవన్ అన్నారు. స్నేహం వేరు బాధ్యత వేరని.. స్నేహం పేరుతో ఇతర నేతలకు మద్దతు ప్రకటిస్తే తెలంగాణలో తాను చూడాలనుకున్న మార్పు రాదని తెలిపారు.
ఏపీలో కూడా అధికార YSRCP పార్టీ తెచ్చిన కొన్ని పాలసీలకు కూడా గతంలో మద్దతు తెలిపానని అలాగని వారు చేసే అవినీతికి కూడా మద్దతు పలికే రకం తాను కానని తెలిపారు. తెలంగాణకు బీసీ నేతను ముఖ్యమంత్రిని చేసే ఏకైక నేత ప్రధాని నరేంద్ర మోదీ మాత్రమేనని పేర్కొన్నారు.