Pawan Kalyan: చిరు ఇంట్లో ప‌వ‌న్.. ఘ‌నంగా స్వాగ‌తించిన కుటుంబీకులు

Chiranjeevi and pawan kalyan

Pawan Kalyan: జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎన్నిక‌ల్లో గెలిచాక తొలిసారి త‌న సోద‌రుడు చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఆయ‌న కారులో నుంచి దిగ‌గానే గులాబీ పూల వ‌ర్షంతో కుటుంబీక‌లు ఘ‌నంగా స్వాగ‌తించారు. ప‌వన్ వ‌స్తున్నార‌ని చిరు కుటుంబీకులంతా ఒక‌చోట చేరారు. ప‌వ‌న్‌ను వ‌రుణ్ తేజ్, రామ్ చ‌ర‌ణ్‌, వ‌దిన సురేఖ కౌగిలించుకుని మ‌రీ అభినంద‌న‌లు తెలుపుతుంటే అభిమానులు ఎంతో ఉత్సాహంతో కేక‌లు వేసారు.