Pawan Kalyan: హంత‌కుడికి బెయిల్ వచ్చింది కానీ చంద్ర‌బాబుకు రాలేదు

గుంటూరులో 14 ఏళ్ల బాలుడిని (అమ‌ర్నాథ్ హ‌త్య కేసు గురించి ప్ర‌స్తావిస్తూ) చంపిన హంత‌కుడికి కూడా బెయిల్ వ‌చ్చేలా చేసారు కానీ ఏ త‌ప్పూ చేయ‌క‌పోయినా అకార‌ణంగా జైల్లో మ‌గ్గుతున్న చంద్ర‌బాబు నాయుడుకి (chandrababu naidu) మాత్రం బెయిల్ రానివ్వ‌కుండా చేస్తున్నార‌ని ప్ర‌భుత్వంపై మండిపడ్డారు జ‌న‌సేనాని పవ‌న్ క‌ళ్యాణ్‌ (pawan kalyan). చంద్ర‌బాబు ఉన్న రాజ‌మండ్రి జైలుకు కూతవేటు దూరంలో నారా లోకేష్‌, ప‌వన్ క‌ళ్యాణ్ క‌లిసి జ‌నసేన (janasena) TDP జాయింట్ యాక్ష‌న్ క‌మిటీని ఏర్పాటుచేసారు. అనంత‌రం వారు మీడియాతో మాట్లాడారు.

“” మాకు ఏపీ అభివృద్ధే ప్ర‌థ‌మం. జ‌న‌సేన పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుంచి మా అజెండా ఇదే. 2014లో తెలుగు దేశం పార్టీకి స‌పోర్ట్ ఇవ్వ‌డానికి కూడా కార‌ణం ఇదే. నేను మొద‌టి నుంచి చెప్తున్న‌ది ఒక్క‌టే వారికి మేం YSRCP వ్య‌తిరేకం కాదు. వారి విధానాలకే మేం వ్య‌తిరేకం. వారి విధానం మార్చుకుంటే మేం ఇలా ద్వేషించేలా చూడం. త‌ప్పుడు కేసులు పెట్ట‌డాలు, క‌న్ఫ్యూజ‌న్‌తో కూడిన మాట‌లు, మ‌ద్య‌పానం నిషేధిస్తామ‌ని చెప్పి విచ్చ‌ల‌విడిగా న‌మ్మ‌డం, నాడీ వ్య‌వ‌స్థ‌ను దెబ్బ‌తీసే క‌ల్తీ మందు అమ్మ‌డం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి.

వీటికి ఒక‌టే విరుగుడు. YSRCP అనే తెగ‌లు ఏపీకి పోవాలంటే జ‌న‌సేన‌, TDP వ్యాక్సినే మార్గం. దానిలో భాగంగానే NDAలో ఉండి కూడా ఏపీ అభివృద్ధి కోసం ఏపీ భ‌ద్ర‌త‌, భ‌విష్య‌త్తు కోసం ఈరోజు చారిత్రాత్మ‌క పొత్తు పెట్టుకోవాల్సి వ‌చ్చింది. రాజ‌మండ్రి జైల్లో అకార‌ణంగా సీనియ‌ర్ నాయకుడు చంద్ర‌బాబు నాయుడుని జైల్లో పెట్టి హింసకు గురిచేస్తున్నారు. బెయిల్ రానివ్వ‌కుండా చేస్తున్నారు. మొన్న గుంటూరులో కూడా 14 ఏళ్ల కుర్రోడిని చంపేసిన వ్య‌క్తికి బెయిల్ వ‌చ్చింది కానీ చంద్ర‌బాబుకు మాత్రం బెయిల్ రానివ్వ‌కుండా చేస్తున్నారు. YSRCP ప్ర‌భుత్వం పోయి జ‌న‌సేన‌-TDP ప్ర‌భుత్వం వ‌స్తేనే ఈ ఆగ‌డాల‌కు విరుగుడు ఉంటుంది. రాజ‌మండ్రిలోనే జాయింట్ యాక్ష‌న్ క‌మిటీని ఎందుకు పెట్టుకున్నామంటే చంద్ర‌బాబుకు మ‌ద్దతుగా ఉండాల‌ని అనుకున్నాం.

తెలుగు దేశం, జ‌న‌సేన పార్టీలు ఎలా క‌లిసి ప‌నిచేయాలి అనే అంశాల‌పై చ‌ర్చించాం. ఉమ్మ‌డి మేనిఫెస్టో ఎలా ఉండాలి అనేదానిపై కూడా చ‌ర్చించుకున్నాం. జ‌న‌సేన‌, తెలుగు దేశం పార్టీ కేడ‌ర్ ఎలా క‌లిసి ప‌నిచేయాలి అనేదానిపై కూడా దీర్ఘకాలిక చ‌ర్చ‌లు జ‌రిపాం “” అని తెలిపారు. (pawan kalyan)

నారా లోకేష్ మాట్లాడుతూ..

“” 4 సంవత్స‌రాలుగా సామాజిక అన్యాయం జ‌రిగింది. ఎప్పుడూ లేని విధంగా దాడులు జ‌రిగాయి. అమ‌ర్నాథ్ అనే కుర్రాడిని త‌న అక్క‌ను వేధిస్తున్నార‌ని ఎదురు తిరిగినందుకు పెట్రోల్ పోసి త‌గ‌ల‌బెట్టి చంపేసారు. నిందితుడికి బెయిల్ వ‌స్తే ఊరేగింపులు చేసుకున్నారు. 34 ల‌క్ష‌ల ఎక‌రాల్లో పంట న‌ష్టం జ‌రిగింది. YSRCP ప్ర‌భుత్వం చేత‌కాని త‌నం వ‌ల్ల సాగునీటి ప్రాజెక్ట్‌లు గాలికి వ‌దిలేసారు. గ‌త నాలుగు సంవ‌త్స‌రాల్లో ఏపీకి ఒక్క ప‌రిశ్ర‌మ రాలేదు. ఉద్యోగాలు, ఉపాధులు లేవు. యువ‌త ప‌క్క రాష్ట్రాల‌కు వెళ్లిపోతున్నారు. ప్ర‌జ‌ల స‌మస్య‌ల‌పై పోరాడ‌దామ‌ని వెళ్తే కేసులు పెడుతున్నారు.

ప‌వ‌న్ ఏపీకి వ‌స్తే లా అండ్ ఆర్డ‌ర్ స‌మ‌స్య వ‌స్తుంది అంటారు. రోడ్డు మార్గంలో వ‌స్తే బోర్డ‌ర్‌లో ఆపేస్తారు. అధికార ప్ర‌భుత్వానికి ఎవ్వ‌రు వ్య‌తిరేకంగా పోరాడినా వారి గొంతు నొక్కేస్తున్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌డానికే టీడీపీ జ‌న‌సేన పొత్తు పెట్టుకుంది. రాబోయే 100 రోజులు కార్య‌చ‌ర‌ణ గురించి జాయింట్ యాక్ష‌న్ క‌మిటీలో చ‌ర్చించాం. ఈనెల‌ 29, 30, 31న ఉమ్మ‌డి జిల్లాల్లో తెలుగు దేశం, జన‌సేన పార్టీ నాయ‌కులు క‌లిసి స‌మావేశాలు ఏర్పాటుచేస్తారు. న‌వంబ‌ర్ 1 నుంచి మేనిఫెస్టో రూపొందించుకుని ప్ర‌తి గ‌డ‌ప‌కు వెళ్లి తెలియ‌జేయాల‌ని నిర్ణ‌యించుకున్నాం. ఇది ప‌వ‌న్ చెప్పిన‌ట్లు చారిత్రాత్మ‌క పొత్తు. నాకెలాంటి సందేహం లేదు. 2024లో మా ప్ర‌భుత్వ‌మే అధికారంలోకి వ‌స్తుంది. “” అని తెలిపారు (nara lokesh)