SVSN Varma: వర్మకు చంద్రబాబు, పవన్ షాక్
SVSN Varma: ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు గానూ ఒక స్థానాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హరిప్రసాద్ అనే జనసేన నేతకు అవకాశం ఇచ్చారు. ఇక తెలుగు దేశం పార్టీ నుంచి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు అవకాశం ఇస్తారని ఆశించారు. తీరా చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు షాకిచ్చారు. ఆ అవకాశాన్ని తెలుగు దేశం పార్టీకి చెందిన రామచంద్రయ్యకు ఇచ్చారు. ఈరోజు వీరిద్దరూ శాసనమండలిలో నామినేషన్ వేయనున్నారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో పిఠాపురం సీటును పవన్ కళ్యాణ్‌కు ఇవ్వడంతో వర్మ ఆగ్రహం వ్యక్తం చేసారు. పార్టీకి రాజీనామా చేసి ఒంటరిగా పోటీ చేయాలనుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వర్మను పిలిపించి నచ్చజెప్పి ఎమ్మెల్సీ కోటాలో అవకాశం ఇస్తానని అన్నారు. తీరా చూస్తే ఇప్పుడు కూడా వర్మకు ఆ అవకాశం దక్కలేదు.