Pankaja Munde: BRS ఆఫర్?
Maharashtra: BJP మాజీ మంత్రి పంకజా ముండే (pankaja munde).. BRS చేరనున్నారా? అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. జరగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో (maharashtra assembly elections) BRS పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి పంకజను BRS లోకి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. అదీకాకుండా.. లైంగిక ఆరోపణల వల్ల భారత రెజ్లర్లు ధర్నా చేస్తున్న సమయంలోనూ పంకజ వారికి సపోర్ట్‌గా నిలిచారు. బీజేపీకి పనిచేసినంత మాత్రాన ఏం జరిగినా చూస్తూ ఊరుకోలేమని, పార్టీకి పనిచేసానే తప్ప పార్టీ తనదికాదని పంకజ అన్నారు. ఎటూ రానున్న ఎన్నికల్లో BJP నుంచి పంకజకు ఎలాంటి ఆఫర్లు వచ్చేలా కనిపించడంలేదు. దీనికి తెలంగాణ సీఎం KCR అడ్వాంటేజ్‌గా తీసుకుని ఆమెను BJP పతనానికి వినియోగించుకోనున్నారని తెలుస్తోంది. KCR మహారాష్ట్ర BRS రాష్ట్ర అధ్యక్ష పదవి ఆఫర్‌ను పంకజకు ఇవ్వనున్నట్లు సమాచారం.