Pankaja Munde: రెజ్ల‌ర్ల‌కు మ‌ద్ద‌తుగా నిలిచిన ఏకైక BJP నేత‌!

Delhi: ఒక BJP నేత (brijbhushan singh) లైంగిక దాడుల‌కు పాల్పడితే.. మ‌రో BJP నేత (pankaja munde) బాధితుల‌కు అండ‌గా నిలిచింది. నెల రోజులుగా దేశ రాజ‌ధాని దిల్లీలో ఆందోళ‌న చేస్తున్న భార‌త రెజ్ల‌ర్ల‌కు కాస్త ఊర‌ట ల‌భించిన‌ట్లైంది. రెజ్ల‌ర్స్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా (wfo) చీఫ్‌, బీజేపీ నేత బ్రిజ్ భూష‌ణ్ సింగ్ (brijbhushan singh) కొంత‌కాలం క్రితం త‌మ ప‌ట్ల అస‌భ్యక‌రంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని అత‌నిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రెజ్ల‌ర్లు (wrestlers protest) రోడ్ల‌పై బైఠాయించి ధ‌ర్నా చేప‌డుతున్నారు. వీరికి స‌పోర్ట్‌గా మ‌గ రెజ్ల‌ర్లు కూడా ఉన్నారు. అయితే ఇప్ప‌టివ‌ర‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్య తీసుకోలేదు. దాదాపు అన్ని పార్టీల వారు వీరికి స‌పోర్ట్ చేస్తుంటే ఒక్క BJP మాత్రం అస‌లు క‌న్నెత్తి చూడ‌టం లేదు. ఇందుకు కార‌ణం బ్రిజ్ భూష‌ణ్ బీజేపీ నేత కావ‌డం.

చివ‌రికి బీజేపీ నేత స్మ్ర‌తి ఇరానీ కూడా రెజ్ల‌ర్లు నాట‌కాలు ఆడుతున్నార‌ని, వారు వేరే ఉద్దేశంతో ఆందోళ‌న చేస్తున్నార‌ని అన్నారు. ఈ నేప‌థ్యంలో బీజేపీ మాజీ మంత్రి పంక‌జా ముండే (pankaja munde) త‌న సోద‌రి, BJP ఎంపీ ప్రీత‌మ్ ముండే (pritam munde)తో క‌లిసి రెజ్ల‌ర్ల వ‌ద్ద‌కు చేరుకున్నారు. తాము బీజేపీ నేత‌ల‌మే అయిన‌ప్ప‌టికీ పార్టీ త‌మ‌ది కాద‌ని, దేశానికి ప‌త‌కాలు సాధించి తెచ్చిన ఆడ‌పిల్ల‌లు త‌మ ప‌ట్ల అన్యాయం జ‌రిగింది అంటుంటే క‌నీసం స్పందించాల్సిన బాధ్య‌త మ‌న‌పై ఉంద‌ని అన్నారు. ఇప్ప‌టివ‌ర‌కు బీజేపీ వ‌ర్గానికి చెందిన ఏ ఒక్క‌రూ రెజ్ల‌ర్ల‌కు న్యాయం జ‌ర‌గాల‌ని అన‌లేదు. పైగా వారి ప‌ట్ల క‌ర్క‌శంగా ప్ర‌వ‌ర్తించారు. ఈ త‌రుణంలో బీజేపీ నేత‌లైన ముండే సిస్ట‌ర్స్ నుంచి స‌పోర్ట్ రావ‌డంతో వారు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.