Panchumarthi Anuradha: ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో ఉన్న ఓ ఎన్జీవోలో విషపూరితమైన ఆహారం తిని ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. మరో 37 మంది పిల్లలను వివిధ హాస్పిటల్స్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. దాంతో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చంద్రబాబు నాయుడు హయాంలో చిన్నారులు కలుషిత ఆహారం తిని చనిపోతున్నారంటూ ఆరోపిస్తున్నారు.
దీనిపై తెలుగు దేశం పార్టీ నేత పంచుమర్తి అనురాధ స్పందించారు. గతంలో జగన్ మోహన్ రెడ్డి హయాంలో దాదాపు 10 ఘటనల్లో జగనన్న గోరుముద్దలు తిని వందలాది మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారని. కనీసం వారి ఆరోగ్యం ఎలా ఉందో కూడా పట్టించుకోని జగన్ ఈరోజు చంద్రబాబు గురించి ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు.
జగనన్న గోరుముద్దలు తిని అనారోగ్య బారిన పడిన పిల్లల విషయంలోనూ చంద్రబాబు నాయుడే ప్రత్యేక దర్యాప్తు చేపడుతున్నారని.. పరిపాలన అంటే ఇలా ఉండాలని అన్నారు. పరిపాలన ఎలా చేయాలో జగన్ తన ఇంట్లో ఉన్న హోం థియేటర్లలో చూసి బుద్ధి తెచ్చుకుంటే మంచిదని సెటైర్ వేసారు.