Palvayi Sravanthi: కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చిన మునుగోడు సీనియర్ నేత

Telangana Elections: కాంగ్రెస్ పార్టీ నేత పాల్వాయి స్ర‌వంతి (palvayi sravanthi) పార్టీకి షాకిచ్చారు. ఈరోజు ఆమె BRS పార్టీలో చేర‌నున్నారు.
ఈరోజు KTR సమక్షంలో BRS పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఇదే బాటలో మరికొంతమంది మునుగోడు (munugode) కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. మునుగోడుకి చెందిన స్ర‌వంతికి టికెట్ ఇవ్వ‌కుండా మొన్న‌టివ‌ర‌కు బీజేపీలో ఉండి మ‌ళ్లీ కాంగ్రెస్‌లోకి వ‌చ్చిన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డికి (komatireddy rajagopal reddy) టికెట్ ఇచ్చినందుకు ఆమె ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.