Asif Ali Zardari: భార్య స్థానంలో కూతురు.. ఇలా ఎందుకు ప్రకటించారు?
Asif Ali Zardari: ఫస్ట్ లేడీ (ప్రథమ మహిళ) అంటే ఓ దేశ అధ్యక్షుడి భార్యను అలా పిలుస్తారు. మనకు ఫస్ట్ లేడీ.. రాష్ట్రపతి సతీమణి. అదే విధంగా ఇతర దేశాల అధ్యక్షుల సతీమణులను ఫస్ట్ లేడీ అంటారు. అయితే పాకిస్థాన్‌లో మాత్రం ఆ దేశ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జార్దారీ తన కుమార్తె ఆసిఫా భుట్టోను (Aseefa Bhutto) ప్రథమ మహిళగా ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఆసిఫా.. ఆసిఫ్‌కి పాకిస్థాన్ దివంగత ప్రధాని బేనజిర్ భుట్టోలకు (Benazir Bhutto) పుట్టిన కుమార్తె.
ఆసిఫ్ అలీ జార్దారీకి కుమారుడు కూడా ఉన్నాడు. అతని పేరు బిలావల్ భుట్టో జార్దారీ. కానీ ఆసిఫ్‌కి బిలావల్ భుట్టోకి మధ్య సత్సంబంధాలు పెద్దగా లేవు. దేశంలో భుట్టో అనేవాడు తానొక్కడే అవ్వాలని ఇంకెవ్వరూ అవ్వకూడదని పట్టుబట్టాడు. దాంతో ఆసిఫ్ ముందు రాజకీయ నైపుణ్యాలను నేర్చుకో ఆ తర్వాత ప్రధాని, అధ్యక్షుడివి అవ్వచ్చు అని క్లాస్ పీకాడు. మరోపక్క ఆసిఫ్‌కి తన కుమార్తె ఆసిఫా అంటే ఎంతో ఇష్టం. బేనజిర్ భుట్టో తర్వాత అంతటి స్థాయిలో తన కుమార్తె ఎదగాలని ఆమెను ఫస్ట్ లేడీగా ప్రకటించారు.
ఇలా కుమార్తెకు ప్రథమ మహిళ స్థానం కల్పించే హక్కు పాకిస్థాన్ దేశానికి మాత్రమే ఉందట. గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన ఆయుబ్ ఖాన్ కూడా తన భార్యకు వయసైపోవడంతో తన కుమార్తెను ఫస్ట్ లేడీగా ప్రకటించారు. అక్కడ ఫస్ట్ లేడీని ఖాతూన్ ఎ అవ్వాల్ అని పిలుస్తారు.