Pakistan: అందుకే మోదీకి శుభాకాంక్షలు చెప్పలేదు
Pakistan: లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలవడంపై అన్ని దేశాలవారు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. కానీ దాయాది దేశం అయిన పాకిస్థాన్ నుంచి మాత్రం ఎలాంటి కామెంట్ లేదు. దీనిపై పాకిస్థాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జెహ్రా బలోచ్ స్పందించారు. భారతదేశ ప్రజలు తమకు ఎలాంటి నాయకుడు కావాలో ఎన్నుకున్నారని.. భారత ఎన్నికల ప్రక్రియ విషయంలో తాము జోక్యం చేసుకోదలచుకోలేదని తెలిపారు.
ఇంకా మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయకుండానే ప్రభుత్వం ఏర్పడకుండానే అభినందనలు తెలిపడం సబబు కాదని పేర్కొన్నారు. భారత్‌తో సహా అన్ని పొరుగు దేశాలతో పాకిస్థాన్ ఎల్లప్పుడూ సహకార సంబంధాలను కోరుకుంటుందని.. జమ్మూ కాశ్మీర్ ప్రధాన వివాదంతో సహా అన్ని సమస్యలను పరిష్కరించడానికి తాము నిర్మాణాత్మక చర్చలకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.