Padi kaushik Reddy: గెలిపించకపోతే సామూహిక ఆత్మహత్యలు చేసుకుంటాం
Padi kaushik Reddy: BRS హుజూరాబాద్ (huzurabad) అభ్యర్ధి పాడి కౌశిక్ రెడ్డి ప్రచారంలో షాకింగ్ కామెంట్స్ చేసారు. ఈసారి ఎన్నికల్లో తనను గెలిపించకపోతే సామూహికంగా ఆత్మహత్యలు చేసుకుంటామని అన్నారు. ప్రజలు ఓటేసి తనను గెలిపిస్తే డిసెంబర్ 4న తన జైత్రయాత్ర జరుగుతుందని.. ఓడిస్తే తన కుటుంబ సభ్యుల శవయాత్ర జరుగుతుందని సంచలన వ్యాఖ్యలు చేసారు. కౌశిక్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేస్తున్న పక్కనే భార్య, కూతురు కూడా ఉన్నారు. వారి ముందే ఆయన ఈ విధంగా మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది.