Pawan Kalyan: ఇక వార్ వన్‌సైడ్..!
Pawan Kalyan: విశాఖపట్నం నేతలతో జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చేది తెలుగు దేశం పార్టీ, జనసేన కూటమే అని వెల్లడించారు. పార్టీ కోసం పని చేసిన వారందరికీ సముచిత గౌరవం కల్పించే బాధ్యత తీసుకుంటానని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు రాష్ట్ర అభివృద్ధి… పార్టీ బలోపేతం కోసమే నిర్ణయాలు తీసుకుంటానని వెల్లడించారు.
క్షేత్ర స్థాయి నుంచి మన బలాన్ని సర్వినియోగపరుచుకుంటూ కూటమిని గెలుపు దిశగా తీసుకెళ్లేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి. వ్యక్తిగతంగా నా గెలుపు నుంచి కాదు.. సమష్టి గెలుపు కోసమే తొలి నుంచీ నా వ్యూహం, అడుగులు ఉంటున్నాయి. ఆదివారం రాత్రి విశాఖపట్నం చేరుకున్న పవన్ కళ్యాణ్ ముందు పార్టీ నాయకులు కొణతాల రామకృష్ణ ఇంటికి వెళ్లారు. దాదాపు గంట పాటు వారిద్దరూ పార్టీ కార్యక్రమాలు, ఎన్నికల్లో అనుసరించే విధానాలపై చర్చించారు.
ALSO READ: Janasena: మంగళగిరిలో జనసేనాని మాస్టర్ ప్లాన్
ఆ తర్వాత విశాఖటప్నం, అనకాపల్లి నియోజకవర్గాలకు చెందిన పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు పాల్గొన్నారు. సోమవారం ఉదయం ఉమ్మడి జిల్లా నాయకులతో ముఖాముఖీ భేటీలు నిర్వహించారు. వీర మహిళ విభాగం ప్రాంతీయ సమన్వయకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ నాయకులతో పలు విషయాలను పంచుకున్నారు. జనసేన కోసం తపించి పని చేసిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం కల్పించే బాధ్యత తీసుకుంటానని భరోసా ఇచ్చారు. 2019 తర్వాత పార్టీ బలంగా నిలిచేందుకు దోహదపడ్డ నాయకులకు అండగా ఉంటాను. ప్రజారాజ్యం సమయంలో ఉన్న ఒక చిన్న పరిచయంతో ఒక నాయకుడికి 2014 తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుడిగా రెండు పర్యాయాలు పదవి ఇప్పించగలిగాను.. అప్పటికి ఆయన మన పార్టీలోకి రాలేదని ఉదహరిస్తూ జనసేన కోసం నిలిచిన ఎవర్నీ విస్మరించేది లేదు.
ఇప్పటి ఎన్నికల స్థానాలు మాత్రమే కాకుండా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వచ్చే అవకాశాలనూ దృష్టిలో ఉంచుకోవాలి. స్థానిక ఎన్నికల్లో కావచ్చు, పీఏసీఎస్‌లలో, ఇతర కీలక నామినేటెడ్ పదవుల్లో సముచిత స్థానాలు మనకు దక్కుతాయి తర్వారా అందరినీ బలోపేతం చేసి ముందుకు వెళ్దాం. మూడింట ఒక వంతు పదవులు దక్కించుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుస్థిర పాలన అవసరం. అప్పుడే అభివృద్ధి సాధ్యం. అలాంటి సుస్థిర పాలన మన కూటమి అందించగలదని ఆర్ధిక నిపులు, పారిశ్రామికవేత్తలు స్పష్టంగా చెప్తున్నారు. (Pawan Kalyan)
ALSO READ: Janasena: టార్గెట్ గోదావరి..!
పార్టీ నిధికి రూ.10 కోట్లు
కూటమి నిర్ణయం అనే ప్రధానంగా రాష్ట్ర ప్రయోజనాలను, సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని చేసిందేనని చెప్పారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాను నిర్ణయాలు తీసుకోనని, సమష్టిగా నిలిచే విధంగా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తానన్నారు. పార్టీ బలోపేతం.. పార్టీ పక్షాన ఎన్నికల నిర్వహణ కోసం రూ.10 కోట్లు తన స్వార్జితాన్ని నిధిగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ఇక్కడ పార్టీలు కులాలపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. మిగిలిన ఏ రాష్ట్రాల్లో లేని విధంగా ఇక్కడ రాజకీయాలు ఉంటాయి. ఎన్నికలు దగ్గరపడుతుండడంతో మరోసారి రాజకీయ ఎత్తులు పైఎత్తులు మొదలైపోయాయి. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు జగన్ మోహన్ రెడ్డి శతవిధాలుగా ప్రయత్నిస్తుంటే జగన్ ప్రభుత్వాన్ని ఎలాగైనా గద్దె దించాలని తెలుగు దేశం, జనసేన పార్టీలు కంకణం కట్టుకున్నాయి.
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే TDP, Janasena, BJP కూటమి అధికారంలోకి రావాలని ఏమాత్రం ఆలస్యం చేసినా YSRCP తిరిగి అధికారంలోకి వస్తే యువత భవిష్యత్తు అంధకరాంలో పడినట్లే అని పవన్, చంద్రబాబు నాయుడు తమ పార్టీ శ్రేణులకు చెప్తున్నారు. పార్టీ లైన్ దాటొద్దంటూ సుతిమెత్తంగా ముఖ్య నేతలను హెచ్చరిస్తున్నారు. పొత్తులో భాగంగా టికెట్ రాలేదని డీలా పడొద్దని అధికారంలోకి వస్తే పదవులు వస్తాయని హామీలు ఇస్తున్నారు.