Opinion Polls ఏం చెప్తున్నాయ్?
Telangana Elections: తెలంగాణ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఒపీనియన్ పోల్స్ (opinion polls), ఎగ్జిట్ పోల్స్ (exit polls) హడావిడి మొదలైపోయింది. తెలంగాణలో పోటీలో ఉన్న ప్రధాన పార్టీలు అధికార BRS , కాంగ్రెస్, BJP. ఓ పక్క భారత రాష్ట్ర సమితి పార్టీ మూడోసారి విజయం తథ్యం అనే ధీమా వ్యక్తం చేస్తోంది. మరోపక్క కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అమలు చేసిన పథకాలను ఇక్కడ కూడా ప్రకటించారు. ఈ హామీలతోనే అక్కడ గెలిచారు కాబట్టి తెలంగాణలోనూ ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు. ఇక ఇప్పటివరకు అభ్యర్ధుల జాబితాను కానీ మెనిఫెస్టోను కానీ విడుదల చేయని BJP గతి ఏంటో వారికే తెలియాలి. (opinion polls)
ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెసే
అధికారంలో ఉన్న పార్టీ కన్ను ఎప్పుడైనా ప్రధాన ప్రతిపక్షం మీదే ఉంటుంది. ఇప్పుడు BRS.. BJP, కాంగ్రెస్‌పై పోరాడుతోంది. కానీ BJPకి నార్త్ రాష్ట్రాల్లో ఉన్న పాపులారిటీ దక్షిణాది రాష్ట్రాల్లో ఉండదని కర్ణాటక ఎన్నికలతో తేలిపోయింది. కాబట్టి ఈసారి ఎలాగైనా కనీసం తెలంగాణ ఎన్నికల్లో అధికారం దక్కించుకోవాలని చూస్తోంది. ఇందుకోసం జనసేన (janasena) పార్టీతో పొత్తుకు కూడా సిద్ధమైంది. జనసేన పార్టీ తెలంగాణలో దాదాపు 36 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది.
అయితే జనసేనకు తెలంగాణ ఎన్నికలు కొత్త కాబట్టి.. BJPతో కలిసి బరిలోకి దిగితే కొన్ని స్థానాలైనా దక్కుతాయని ఆశిస్తోంది. అసలు BJPకే తెలంగాణలో గతి లేదు. ఇక జనసేనకు ఏం నమ్మకం కలిగిస్తుంది. జనసేన పవన్ కళ్యాణ్ (pawan kalyan) పార్టీ కాబట్టి ఆయన ఒంటరిగా పోటీ చేసినా బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో BJP గ్రాఫ్ పడిపోతోంది. అందుకే భారతీయ జనతా పార్టీ కూడా జనసేన సపోర్ట్ కోరుతోంది.
కాంగ్రెస్‌కు పెరుగుతున్న పాపులారిటీ
కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌కు (congress) తెలంగాణలోనూ (telangana) పాపులారిటీ పెరుగుతున్నట్లు ఒపీనియన్ పోల్స్ (opinion polls) చెప్తున్నాయి. కాబట్టి ఇప్పుడు భారత రాష్ట్ర సమితి పార్టీకి కాంగ్రెస్‌ని ఓడించడం కాస్త సవాల్‌తో కూడిన పనే. కాంగ్రెస్ పార్టీ బలపడుతోందంటే అందుకు కారణం రెడ్డి కమ్యూనిటీనే (reddy community). మరోపక్క సీఎం KCR వెలమ సంఘానికి (velama community) చెందిన నేత.
2018 ఎన్నికల సమయంలో అన్ని కులాల వారిని కలుపుకుని వెళ్లారు కాబట్టే రెండోసారి ఆయనకు అధికారాన్ని కట్టబెట్టారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఇదివరకటిలా లేదు. రెడ్డి కులం వారు తమకు ప్రభుత్వం నుంచి అందాల్సిన బెనిఫిట్స్ చాలానే ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. కాబట్టి వారు కాంగ్రెస్‌కు మొగ్గు చూపే అవకాశం లేకపోలేదని ఓపీనియన్ పోల్స్ అంటున్నాయి. (opinion polls)