Telangana Next CM: 44% మంది ఓటు కేసీఆర్‌కే..!
Telangana Next CM: తెలంగాణ తదుపరి సీఎం ఎవరు? ప్రస్తుతం తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే ఉత్కంఠంగా జరుగుతున్న చర్చ. ఓపక్క ఎగ్జిట్ పోల్స్ (exit polls) ఫలితాలేమో కాంగ్రెస్‌దే (congress) అధికారం అంటున్నాయి. మరోపక్క అధికార BRS పార్టీ ఈసారి అధికారంలోకి వచ్చేది తామే అంటున్నాయి. ఎవరు గెలుస్తారో రేపటికి తెలిసిపోతుంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ తదుపరి సీఎం ఎవరైతే బాగుంటుంది అనే అంశంపై టైమ్స్ నౌ సంస్థ ఓ సర్వే చేసింది. ఈ సర్వేలో KCR , రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క పేర్లు ఉన్నాయి. ఈ ఓపీనియన్ పోల్స్‌లో KCRకి 44%, రేవంత్ రెడ్డికి 15%, భట్టి విక్రమార్కకు 20% ఓట్లు పడ్డాయి. దీనిని బట్టి చూస్తే మెజారిటీ ప్రజలు కోరుకునేది KCRనే. ఇలాంటి ఎన్ని సర్వేలు చేసినా చివరికి ఎవరికి ఎక్కువ ఓట్లు పడితే ఆ పార్టీనే గెలుస్తుంది.. ఆ పార్టీ ఎన్నుకునే వ్యక్తే సీఎం అవుతారు.