AP Elections: కుటుంబం నుంచి ఎవరో ఒకరికే టికెట్
AP Elections: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ తమ కుటుంబం నుంచి ఎవరికో ఒకరికే టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. నందమూరి కుటుంబం నుంచి హిందూపూర్ ఎమ్మెల్యేగా బాలకృష్ణ (nandamuri balakrishna) మాత్రమే ఉన్నారు. ఆయనకు టికెట్ కన్ఫామ్గా ఇవ్వాల్సిందే. లేదంటే దబిడి దిబిడి అవుతుందని చంద్రబాబు నాయుడుకు (chandrababu naidu) కూడా తెలుసు.
ఇక నారా కుటుంబం నుంచి చూసుకుంటే ఇద్దరు బరిలో ఉన్నారు. ఒకరు చంద్రబాబు నాయుడు కాగా మరొకరు ఆయన కుమారుడు నారా లోకేష్ (nara lokesh). 2024 ఎన్నికల్లో లోకేష్ మంగళగిరి (mangalagiri) నుంచి పోటీ చేస్తానని.. భారీ మెజార్టీతో గెలుస్తానని అంటున్నారు. మరోపక్క చంద్రబాబు తన నియోజకవర్గం అయిన కుప్పం (kuppam) నుంచే కాకుండా మరో సీటులోనూ పోటీ చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. చంద్రబాబు కచ్చితంగా పోటీ చేయాలనుకుంటున్నారు. కాబట్టి లోకేష్‌కు ఈసారి టికెట్ ఇచ్చే అవకాశం లేదని కూడా ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే టికెట్ కాకపోయినా ఆ తర్వాత ఏదన్నా మంత్రి పదవి ఇచ్చే యోచనలో చంద్రబాబు ఉన్నారు.