Kavitha కేసులో మ‌రో బిగ్ ట్విస్ట్..!

Kavitha: భార‌త రాష్ట్ర స‌మితి (BRS) ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత అరెస్ట్ అంశంలో మ‌రో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో (Delhi Liquor Scam) భాగంగా ఈడీ అధికారులు గ‌త శుక్ర‌వారం క‌విత‌ను అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నెల 23 వ‌ర‌కు క‌విత రిమాండ్‌లో ఉండ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో కేసు విచారణ జ‌రుపుతున్న ఢిల్లీ కోర్టు జ‌డ్జి జస్టిస్ నాగ్ పాల్ బ‌దిలీ అయ్యారు. ఆయ‌న స్థానంలో జ‌స్టిస్ కావేరి భావేజాను నియ‌మించారు. ఇప్ప‌టివ‌ర‌కు ఈ కేసుకు సంబంధించి జ‌స్టిస్ నాగ్ పాల్ కీల‌క ఆదేశాలు ఇస్తూ వ‌చ్చారు. ఈ కేసు గురించి అన్నీ ఆయ‌న‌కు బాగా తెలుసు. కేసు త్వ‌ర‌లో తేల‌నుంద‌న్న నేప‌థ్యంలో ఆయ‌న బ‌దిలీ అవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

మ‌రోప‌క్క సుప్రీంకోర్టులో తాను వేసిన పిటిష‌న్ ఇంకా విచార‌ణ‌లో ఉండ‌గానే ఈడీ అధికారులు త‌న‌ను అరెస్ట్ చేయ‌డం ప‌ట్ల మ‌రో రిట్ పిటిష‌న్ దాఖ‌లు చేసారు క‌విత‌. అయితే ఆ పిటిషన్‌లో త‌ప్పులు ఉన్నాయ‌ని దానిని విత్‌డ్రా చేసుకున్నారు. మ‌ళ్లీ త్వ‌ర‌లో ఫ్రెష్ పిటిష‌న్ వేయ‌నున్నారు.