Kinjarapu Atchennaidu: 2020 జూన్ 12న అరెస్ట్.. 2024 జూన్ 12న మంత్రిగా ప్రమాణ స్వీకారం
Kinjarapu Atchennaidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్‌తో పాటు మరో 17 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసారు. ఆ మంత్రుల్లో కింజరపు అచ్చెన్నాయుడు కూడా ఉన్నారు. మిగతావారికి ఏమో కానీ.. జూన్ 12న ప్రమాణ స్వీకారం చేయడం మాత్రం అచ్చెన్నాయుడుకి జీవితాంతం గుర్తుండిపోతుంది. ఎందుకంటే.. 2020 జూన్ 12న అచ్చెన్నాయుడుని తప్పుడు కేసులో ఇరికించి అరెస్ట్ చేయించారు. ఆయన అరెస్ట్ అయింది జూన్ 12వ తేదీనే. ఈ నాలుగేళ్లలో నేరం జరిగినట్లు ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు. కట్ చేస్తే.. 2024 జూన్ 12న ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు.