Political Leaders: మీరేంటో… మీ విధానాలేంటో…!
Hyderabad: రాజకీయ నాయకులు (political leaders) ఒక్కోసారి ఏం మాట్లాడతారో వారికే అర్థంకాదు. ఎన్నికల సమయంలో పబ్లిక్ మీటింగ్‌లలో మాట్లాడే ముందు ఆచి తూచి మాట్లాడాలి. లేదంటే ఎన్నికల సమయంలో ఓట్లపై ఎఫెక్ట్ పడుతుంది. తెలంగాణ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కొందరు తెలంగాణ రాజకీయ నేతలు చేసిన కామెంట్స్ చూస్తే నవ్వొస్తోంది. ప్రజలు ఏమనుకుంటారో.. పార్టీ హైకమాండ్ ఏమనుకుంటుందో అన్న ఆలోచన లేకుండా అవి ఎందుకు ఇవి ఎందుకు అని కామెంట్స్ చేసేస్తుంటారు. ఆ తర్వాత నేను అలా అనలేదు.. నా ఉద్దేశం అది కాదు అని కవరింగ్ చేసుకుంటారు. ఈ మధ్యకాలంలో తెలంగాణకు చెందిన ఐదుగురు నేతలు చేసిన వైరల్ కామెంట్స్ ఏంటో చూద్దాం.
రేవంత్ రెడ్డి (revanth reddy)
కాంగ్రెస్ నేత, TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీడియా ముందు నోటికొచ్చినట్లు మాట్లాడటంలో ముందుంటారు. మాట్లాడితే రెడ్లు గొప్ప రెడ్లు మాత్రమే గొప్ప అంటుంటారు. ఇతర కులాల వారంటేనే గిట్టనట్లు వ్యవహరిస్తారు. ఇటీవల ఆయన అమెరికాలో జరిగిన తానా సభకు వెళ్లినప్పుడు తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఎందుకు? అని మాట్లాడారు. ఆయన వ్యాఖ్యల పట్ల సొంత పార్టీ కార్యకర్తలు కూడా అసహనం వ్యక్తం చేసారు. ఎన్నికల సమయంలో కాస్త నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది అంటూ క్లాస్ పీకారు.
శ్రీధర్ బాబు (sridhar babu)
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు (sridhar babu) తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ చెక్ డ్యాంల అవసరం ఏముందని అన్నారు. దీనిపై BRS నేతలు భగ్గుమనడంతో.. నేను అలా అనలేదు కావాలనే అధికార పార్టీ తనపై నిందలు వేస్తున్నారని మాట మార్చారు. (political leaders)
భట్టి విక్రమార్క (bhatti vikramarka)
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌పై (dharani portal) CLP భట్టి విక్రమార్క షాకింగ్ కామెంట్స్ చేసారు. ధరణి పోర్టల్ ఓ మహమ్మారి అని ప్రజలకు దాని అవసరం లేదని అన్నారు. ధరణి పోర్టల్ పేరుతో భూములు ఆక్రమించుకుంటున్నారని రైతులు ఆందోళన చేస్తున్నారని భట్టి అన్నారు. దీనిపై సీఎం కేసీఆర్ స్పందిస్తూ విక్రమార్కకు క్లాస్ పీకారు. ఆ తర్వాత మళ్లీ ప్రెస్ మీట్ పెట్టి తన వ్యాఖ్యలను తప్పుదోవ పట్టిస్తున్నారని భట్టి అన్నారు.
జయప్రకాశ్ నారాయణ (jayaprakash narayana)
లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ కూడా ముందు వెనకా ఆలోచించకుండా వ్యాఖ్యలు చేసారు. హైదరాబాద్‌లో నగరంలో మెట్రో సేవలను విస్తరించడం అవసరం. కానీ జనాలు ఎక్కువగా లేని ఔటర్ రింగ్ రోడ్‌లో మెట్రో నిర్మాణం ఆర్థికంగా భారం అవుతుందని ఇది మరో కాళేశ్వరం ప్రాజెక్టులా మారుతుందని జయప్రకాశ్ నారాయణ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే నగరంలో 69 కిలోమీటర్ల మేర మెట్రో సేవలు అందుబాటులో ఉండగా.. మొత్తం 415 కిలోమీటర్ల మేర మెట్రోను విస్తరిస్తామని తెలంగాణ కేబినెట్ ప్రకటించింది. ఇందుకోసం రూ.69 వేల కోట్లు అవసరం అవుతాయని అంచనా వేసింది. దీని గురించి జయప్రకాశ్ మాట్లాడుతూ… ఇప్పుడు ఓఆర్ఆర్ దగ్గర మెట్రో అవసరం ఏముందని అన్నారు.
కిషన్ రెడ్డి (kishan reddy)
BJP నేత కిషన్ రెడ్డి ప్రజలకు ఉచిత పథకాలు అవసరం ఏముందని అన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినా మంచిదే కానీ.. ఉచిత పథకాలను ప్రకటించకూడదని ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల సందర్భంగా తమ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. (political leaders)