Kalingiri Shanthi: అడ్డంగా బుక్కైన శాంతి.. భ‌ర్త మ‌ద‌న్ చెప్పింది నిజ‌మేనా?

notices to endowment assistant commissioner kalingiri shanthi

Kalingiri Shanthi: దేవాదాయ శాఖ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ క‌లింగిరి శాంతిపై మ‌రో 6 అభియోగాలు న‌మోద‌య్యాయి. శాంతి భ‌ర్త అయిన మ‌ద‌న్ మోహ‌న్ ఆమెకు పుట్టిన బిడ్డ‌కు తండ్రి ఎవ‌రో తేల్చిండి అని మీడియా ముందుకు వ‌చ్చి ఆరోప‌ణ‌లు చేయ‌డం షాక్‌కు గురిచేసింది. పైగా ఆయ‌న వైఎస్సార్ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత విజ‌య‌సాయి రెడ్డిపై అనుమానం ఉంద‌ని చెప్ప‌డంతో తీవ్ర దుమారానికి దారి తీసింది. ఈ నేప‌థ్యంలో శాంతి మీడ‌యా ముందుకు వ‌చ్చి.. త‌న‌కు ఎవ్వ‌రితోనూ అక్ర‌మ సంబంధం లేద‌ని మ‌ద‌న్‌కు విడాకులు ఇచ్చి సుభాష్ అనే వ్య‌క్తిని పెళ్లి చేసుకున్నాన‌ని అత‌ని ద్వారానే బిడ్డ‌ను క‌న్నాన‌ని అన్నారు.

అయితే ఇప్పుడు దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ స‌త్యానారాయ‌ణ శాంతిపై మ‌రో 6 అభియోగాలు మోపుతూ నోటీసులు జారీ చేసారు. 2020లో శాంతి దేవ‌దాయ శాఖ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్‌గా చేరిన‌ప్పుడు భ‌ర్త పేరు వ‌ద్ద మ‌ద‌న్ మోహ‌న్ అని రాసార‌ని.. జ‌న‌వ‌రి 25న ప్ర‌సూతి సెల‌వుల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునే స‌మ‌యంలోనూ అప్లికేష‌న్ ఫాంలో భ‌ర్త పేరు మ‌ద‌న్ మోహ‌న్ అని రాసార‌ని ఆరోపించారు. మ‌రి మ‌ద‌న్‌తో విడాకులు తీసుకుని సుభాష్‌ను చేసుకున్న‌ప్పుడు సుభాష్ పేరు రాయ‌కుండా మ‌ద‌న్ పేరు ఎందుకు రాసారో స‌మాధానం చెప్పాల‌ని ఆదేశాలు జారీ చేసారు.

దీనిని బ‌ట్టి చూస్తే శాంతి భ‌ర్త మోహ‌న్ ఆరోప‌ణ‌లు నిజ‌మే అనిపిస్తోంది. త‌న చేత బ‌ల‌వంతంగా ద‌ర‌ఖాస్తుల‌పై సంతకం చేయించుకుని ఆ త‌ర్వాత అవి విడాకులు అని ప్ర‌చారం చేస్తున్నార‌ని.. తాను విడాకులు ఇవ్వ‌లేద‌ని ఆయ‌న ముందు నుంచీ ఆరోపిస్తున్నారు. ఒక‌వేళ త‌న‌కు విడాకులు ఇచ్చి ఉంటే మ‌రి 2020లో భ‌ర్త పేరు మ‌ద‌న్ మోహ‌న్ అని ఎందుకు రాయాల్సి వ‌చ్చింద‌ని ప్ర‌శ్నిస్తున్నారు.