North Korea: అమెరికా పెద్ద తప్పు చేసింది.. నిప్పుతో చెలగాటమే
North Korea: రష్యా వద్దంటున్నా వినకుండా ఉక్రెయిన్‌కు సాయం చేసి రష్యా పెద్ద తప్పు చేసిందని ఉత్తర కొరియా అభిప్రాయపడింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సోదరి కిమ్ యో జాంగ్ మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా నిప్పుతో చెలగాటం ఆడుతోందని అన్నారు. ఉక్రెయిన్‌కు ఏ దేశమైనా సాయం చేస్తే మూడో ప్రపంచ యుద్ధమే అని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎంత హెచ్చరించినా అమెరికా లైట్ తీసుకుందంటే.. కచ్చితంగా అది నిప్పుతో చెలగాటం ఆడుతున్నట్లే అని తెలిపారు.
ఇప్పుడు అమెరికా చేసిన పనికి రష్యా నుంచి ఎదురైయ్యే తీవ్ర పర్యావసనాలను ఎదుర్కొనే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. మరోపక్క అమెరికా ఉత్తర కొరియాపై మండిపడింది. గతేడాది సెప్టెంబర్ నుంచి రష్యాకు 16,500 కంటైనర్లతో కూడిన ఆయుధాలను ఉత్తర కొరియా పంపుతోందని అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు ఇవే ఆయుధాలను ఉక్రెయిన్‌పై దాడి చేసేందుకు రష్యా వాడుతుంటే.. తాము ఉక్రెయిన్‌కు ఆయుధాలను పంపించడంలో తప్పేముందని ప్రశ్నించింది. ఇటీవల ఉత్తర కొరియా, రష్యా అధినేతలు కలుసుకుని స్నేహపూర్వకమైన అభిప్రాయాలు తీసుకున్నాయి. దాంతో ఉత్తర కొరియా రష్యాకే మద్దతు పలుకుతోంది.