North Korea: చైనాలో వరదలు.. 30 అధికారులకు ఉరి శిక్ష
North Korea: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ నియంత పాలన ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రజల కంటే ఆయనకు తన పాలనే ముఖ్యం అనుకుని జీవిస్తున్న వ్యక్తి ఆయన. అలాంటి తొలిసారి ఆయన ప్రజల గురించి ఆలోచించి తీసుకున్న కీలక నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగిందంటే.. చైనా సమీపంలోని చాంగాంగ్ ప్రావిన్స్ వరదల్లో మునిగిపోయింది. ఈ వరదల్లో దాదాపు 1000 మందికి పైగా జనం చనిపోయారు. అయితే వరదల సమయంలో ప్రజలను కాపాడని 20 నుండి 30 మంది ఉత్తర కొరియా అధికారులకు కిమ్ ఉరిశిక్ష విధించారట. ఈ విషయాన్ని దక్షిణ కొరియా మీడియా ద్వారా వెల్లడించింది.
ఈ విషయం ఇప్పుడెందుకు చర్చనీయాంశంగా మారిందంటే.. గతేడాది కూడా ఉత్తర కొరియాలో భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తాయి. అయితే ఆ సమయంలో కిమ్ ఒక ప్రకటన విడుదల చేసాడు. ఈదురు గాలుల కారణంగా తన ఫోటోలు కానీ తన తండ్రి ఫోటోలు, విగ్రహాలు కానీ కూలిపోయి పడిపోతే వారికి కఠిన శిక్షలు తప్పదు అని ఆ ప్రకటనలో పేర్కొన్నాడు. అలాంటి కిమ్ ఇప్పుడు ప్రజలను కాపాడని అధికారులకు ఉరిశిక్ష వేయడం ఏంటి అనే చర్చ మొదలైంది.