AP Elections: ముందస్తు ఎన్నికలకు ప్లాన్ వేసి.. ఇప్పుడు యూ టర్న్?
AP: ముందస్తు ఎన్నికలకు (ap elections) వెళ్లిది లేదని షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ (jagan) తేల్చి చెప్పారు. కానీ గతంలో తెలంగాణ ఎన్నికల్లాగే ముందస్తుకు వెళ్లాలని సీఎం జగన్ తన కేడర్‌తో కూడా చర్చించారు. అందుకోసం అన్నీ రెడీ చేసుకుని ఇప్పుడు ముందస్తుకు నో చెప్పారు. ముందస్తు ఎన్నికల కోసమే జగన్ తమ చేత గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం చేయించారని YCP నేతలకూ తెలుసు. ఈ నాలుగేళ్లలో ఏం చేసామో ప్రజలకు చెప్పుకుని వచ్చే ఎన్నికల్లోనూ తమనే ఆశీర్వదించాలని అడగాలని ప్లాన్లు వేసుకున్నారు. కానీ గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభించిన తర్వాత ప్రజలు తమ పాలన గురించి ఏమనుకుంటున్నారో జగన్‌కు అర్థమైపోయింది. ఇప్పుడు వెళ్లి మీ ఓట్లు మళ్లీ మాకే వేయండి అని అడిగితే ఎక్కడ కొడతారో అన్న భయం జగన్‌లో మొదలైనట్లుంది. అందుకే ముందస్తు ఎన్నికలు వద్దు అనుకున్నట్లు ఉన్నారని YCPలో చర్చ జరుగుతోంది.
మరో పక్క TDP మొన్న జరిగిన మహానాడులో మినీ మేనిఫెస్టో (manifesto) ప్రవేశపెట్టేసింది. దాంతో వచ్చే ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలో YCPకి అర్థంకాని పరిస్థితి. ఈ ఐదేళ్ల పాలనలో రాష్ట్రానికి ఏమీ చేయలేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. దీంతో అధికారాన్ని ముందు వదులుకోవడం ఎందుకని జగన్ ముందస్తు ఆలోచనలపై పూర్తి స్థాయిలో వెనక్కి తగ్గారని వైసీపీ నేతలు కూడా ఓ అభిప్రాయానికి వచ్చారు. అందులోనూ 2024లో లోక్‌సభ ఎన్నికలు (loksabha elections) జరుగుతున్నాయి. ఆ ఎన్నికలతో పాటు ప్రాంతీయ ఎన్నికలు జరిగితే అధికార పార్టీలకు నష్టం. ఆ భయంతోనే తెలంగాణ సీఎం KCR ముందస్తుకు వెళ్లాలనుకున్నారు. కానీ జగన్ మాత్రం ఇలా చేయలేకపోతున్నారు.