Congress: మెగా డీఎస్సీ ప్రకటన లేదు.. రుణమాఫీ రాలేదు.. కారణం ఏంటి?
Congress: గెలిపిస్తే 24 గంటల్లోనే రుణమాఫీ అని రాహుల్ గాంధీ… గెలిస్తే డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి (revanth reddy) ప్రకటించారు. తొలి క్యాబినెట్లోనే ‘మెగా డిఎస్సీని’ ప్రకటిస్తామని కాంగ్రెస్ తమ మ్యానిఫెస్టోలో పొందుపరిచింది. మొన్నే తొలి క్యాబినెట్ సమావేశం ముగిసింది. ఇంత వరకు మెగా డీఎస్సీకి సంబంధించి ఒక్క ప్రకటన లేదు. ఈ రోజు రుణమాఫీ జరగాల్సి ఉంది. అది కూడా కాలేదు. ఈ రెండింటికీ సంబంధించి ఎటువంటి ప్రకటన ఇప్పటివరకు వెలువడలేదని రైతులు, నిరుద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎందుకు ప్రకటించలేదో కనీసం కారణం చెప్తారని ఎదురుచూస్తున్నారు.