Narendra Modi: చిన్న‌పిల్లాడిలా మోదీ వేలు లాగి ఇంక్ మార్క్ చూసిన నితీష్‌.. వీడియో వైర‌ల్

nitish kumar sees narendra modi finger to check indelible ink mark

Narendra Modi: ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ.. జేడీయూ అధినేత నితీష్ కుమార్ మ‌ధ్య ఆస‌క్తిక‌ర‌మైన స‌న్నివేశం చోటుచేసుకుంది. బిహార్‌లోని రాజ్‌గిరిలో కొత్త న‌లంద యూనివ‌ర్సిటీ క్యాంప‌స్‌ను ప్రారంభించేందుకు మోదీ వెళ్లారు. ఆ కార్య‌క్ర‌మంలో మోదీ పక్క‌నే నితీష్ కూర్చున్నారు. మోదీ ప్ర‌సంగం వింటుండ‌గా.. ప‌క్క‌నే ఉన్న నితీష్ ఉన్న‌ట్టుండి మోదీ వేలు లాక్కుని మ‌రీ ఓటు వేసిన‌ప్ప‌టి సిరా ఇంకా ఉందా అని అడిగారు. ముందు మోదీ ఏమైంద‌బ్బా అని షాకై.. ఆ త‌ర్వాత అవును ఇంక్ అలాగే ఉంది అన్నారు. అప్పుడు నితీష్ కూడా నా వేలికి కూడా ఇంక్ అలాగే ఉంది ఇంకా పోలేదు అని చూపించ‌డం అక్క‌డి మీడియా వీడియో తీసింది. ఆ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.