Nitish Kumar: I-N-D-I-A వద్దు అంటున్న బిహార్ సీఎం
Delhi: 2024 లోక్‌సభ ఎన్నికల్లో BJPని ఓడించేందుకు 26 పార్టీలు కలిసి ఒకే వేదికపైకి వచ్చాయి. ఈ అపోజిషన్ మీట్‌కి I-N-D-I-A అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ కూటమికి I-N-D-I-A అని పెట్టడం బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు (nitish kumar) అస్సలు ఇష్టం లేదట. ఈ కూటమికి I-N-D-I-A అని ఎలా పేరు పెడతారు అని ఆగ్రహం వ్యక్తం చేసారట. అంతేకాదు నిన్న జరిగిన అపోజిషన్ మీట్ నుంచి కూడా నితీష్ (nitish kumar) త్వరగా వెళ్లిపోయారు. ఈ అపోజిషన్ కూటమికి పేరు పెట్టే ముందు కాంగ్రెస్ నితీష్ కుమార్‌తో ఎలాంటి సంప్రదింపులు జరపలేదట. ముందే తనతో చర్చించి ఉంటే ఈ పేరు పెట్టడానికి ఒప్పుకునేవారే కాదని తెలుస్తోంది.
ఈ కూటమికి సోనియా గాంధీ (sonia gandhi) ప్రెసిడెంట్‌గా.. సీనియర్ కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే (mallikarjun kharge) కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. అయితే తనను కన్వీనర్‌ను చేయనందుకు కూడా నితీష్ (nitish kumar) కోపంగా ఉన్నారట. ఎందుకంటే BJPని ఓడించడానికి అపోజిషన్ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలి అని ముందు పిలుపునిచ్చిందే నితీష్ కుమార్. ఆ తర్వాత ఆయనతో కాంగ్రెస్ చేతులు కలిపింది. వీరిద్దరూ కలిసి ఇతర పార్టీలను ఒకే స్టేజ్‌పైకి తెచ్చాయి. అలాంటప్పుడు తనకు ఇవ్వాల్సిన కనీస గుర్తింపు కూడా లేదని నితీష్ ఫీలవుతున్నారట.