Nirmala Sitharaman: నా ద‌గ్గ‌ర డ‌బ్బు లేదు.. పోటీ చేయ‌లేను

Nirmala Sitharaman: ఈసారి లోక్ స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు త‌న‌కు భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆఫ‌ర్ ఇచ్చింద‌ని కానీ పోటీ చేయ‌డానికి త‌న వ‌ద్ద డ‌బ్బు లేద‌ని తెలిపారు కేంద్ర‌మంత్రి నిర్మలా సీతారామ‌న్. త‌న‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి కానీ త‌మిళ‌నాడు నుంచి కానీ పోటీ చేయాల‌ని జేపీ న‌డ్డా (JP Nadda) సూచించార‌ని కానీ అందుకు త‌న వ‌ద్ద డ‌బ్బు లేద‌ని ఆఫ‌ర్‌కు నో చెప్పిన‌ట్లు వెల్ల‌డించారు.

“” న‌న్ను పోటీ చేయాల‌ని చెప్పిన‌ప్పుడు నేను ప‌ది రోజుల పాటు ఆలోచించాను. బాగా ఆలోచించాకే వ‌ద్ద‌ని చెప్పాను. ఎందుకంటే నేను ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి చేయాలా లేక త‌మిళ‌నాడు నుంచి చేయాలా అనే సందేహం ఉంది. అదీకాకుండా గెల‌వ‌లంటే ఫ‌లానా కులానికి, వ‌ర్గానికి చెంది ఉండాలి. అదీ కాకుండా నా ద‌గ్గ‌ర అంత డ‌బ్బు లేదు. అందుకే నో చెప్పాను. నా మాట‌ను వారు గౌర‌వించినందుకు సంతోషంగా ఉంది“‘ అని నిర్మ‌ల వెల్ల‌డించారు.

దేశ ఆర్థిక శాఖ మంత్రి ద‌గ్గ‌ర పోటీ చేయ‌డానికి డ‌బ్బులు లేక‌పోవ‌డం ఏంటి అని అడ‌గ్గా.. దేశ సంప‌ద త‌న‌ది కాదు క‌దా అని బ‌దులిచ్చారు.