Nirmala Sitharaman: జయలలిత చీర లాగినప్పుడు ఏమైపోయారు?
Delhi: పార్లమెంట్ సమావేశాల్లో (parliament session) కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ (nirmala sitharaman) ఉగ్రస్వరూపులయ్యారు. మణిపూర్‌లో ఆడవాళ్లపై అఘాయిత్యాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయని DMK నేత కణిమొళి (kanimozhi) మండిపడ్డారు. దాని గురించి బీజేపీ నుంచి ఇప్పటివరకు పార్లమెంట్‌లో ఒక్కరూ మాట్లాడలేదని అన్నారు. దాంతో నిర్మలమ్మకి ఒళ్లు మండిపోయింది. 1989లో దివంగత నేత జయలలిత చీర కొంగు లాగినప్పుడు ఏమైంది ఈ బుద్ధి అని నిలదీసారు.
“” 1989 మార్చి 25.. జయలలిత చీర లాగారు మీ DMK పార్టీ వాళ్లు. అప్పుడు అది తప్పు అనిపించలేదా? మణిపూర్‌లోనే కాదు దాదాపు అన్ని రాష్ట్రాల్లో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయ్. మీరు కౌరవుల సభ గురించి ద్రౌపది గురించి మాట్లాడుతున్నారు. జయలలిత గరించి ఎందుకు మాట్లాడటంలేదు? “” అంటూ మండిపడ్డారు నిర్మల.