Donald Trump కి నిక్కీ హేలీ షాక్
Donald Trump: రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీలో నిక్కీ హేలీకి (Nikki Haley) తొలి విజయం అమెరికాలో రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న భారత సంతతి నాయకురాలు నిక్కీ హేలీ ఎట్టకేలకు తొలి విజయం సొంతం చేసుకున్నారు. డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా ప్రైమరీ ఎన్నికల్లో హెలీ గెలుపొందారు. హేలీ విజయంతో అభ్యర్థిత్వ రేసులో దూసుకుపోతున్న ట్రంప్ విజయ పరంపరకు అడ్డుకట్ట పడింది. అయితే ట్రంప్ ను అధిగమించాలంటే పలు ప్రైమరీల్లో నిక్కీ భారీ గెలుపు నమోదు చేయాల్సి ఉంటుంది.
అయితే, అమెరికాలోని సౌత్ కరోలినాలో శనివారం జరిగిన రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ నిక్కీ హేలీని ఈజీగా ఓడించారు. సౌత్ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీని ఆమె సొంత రాష్ట్రంలోనే ఓడించడం విశేషం. మొదటి నాలుగు ప్రధాన నామినేషన్ పోటీల్లో ట్రంప్ విజయం సాధించారు. ఈ ఎన్నికలకు ముందు అధ్యక్ష పోటీదారులు తమ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కాగా సౌత్ కరోలినాలో జరిగిన రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో తన ప్రత్యర్థి నిక్కీ హేలీపై ట్రంప్ విజయం సాధించారు. న్యూ హాంప్‌షైర్ ప్రైమరీ ఎన్నికల్లో మొత్తం 75 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇందులో ట్రంప్‌కు 54.4 శాతం ఓట్లు రాగా, హేలీకి 43.3 శాతం ఓట్లు వచ్చాయి. అయినప్పటికీ రేసు నుంచి వైదొలగడానికి నిక్కీ హేలీ నిరాకరించారు.
ఓవైపు ట్రంప్ ఆధిపత్యం కొనసాగుతున్నప్పటికీ.. ఆయనకు ప్రత్యామ్నాయం తానేనంటూ నిక్కీ ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ట్రంప్ నెగ్గిన ప్రతినిధుల సంఖ్య 244కు చేరుకుంది. ఈ క్రమంలో ట్రంప్‌కు ప్రజలు మంచి మద్దతు పలికారని చెప్పవచ్చు. ఎన్నికల తర్వాత వచ్చిన సర్వేల్లో వచ్చే ఎన్నికల్లో కూడా ట్రంప్ గెలుపు ఖాయమని చెబుతున్నారు. నేరారోపణలు ఉన్నప్పటికీ, ట్రంప్ ఇక్కడ పెద్ద ఆధిక్యం సాధించారు. రెండుసార్లు గవర్నర్ ఎన్నికల్లో విజయం సాధించిన సౌత్ కరోలినాకు చెందిన హేలీ ట్రంప్‌ను ఓడించలేకపోయారు.
ALSO READ: Nikki Haley: భారత్‌కు అమెరికాపై నమ్మకంలేదు.. నిక్కీ షాకింగ్ కామెంట్స్
ప్రస్తుతానికి రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూసుకెళ్తున్నారు. అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం జరిగిన రాష్ట్రాల ఎన్నికల్లో ట్రంప్ ముందంజలో ఉన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లు భావిస్తున్నారు. మంగళవారం జరిగే సూపర్ ట్యూస్‌డేలో డెమోక్రటిక్, రిపబ్లికన్ మద్దతుదారులు…అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకోనున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీల తరఫున పోటీపడే అభ్యర్థిని ఎన్నుకునేందుకు…ట్యూస్‌డేనాడు ఓటింగ్ నిర్వహిస్తారు. ఆరోజు అన్నిరాష్ట్రాల్లోని ఇరుపార్టీల ప్రతినిధులు ఓటింగ్‌లో పాల్గొంటారు. (Donald Trump)
రిపబ్లికన్ పార్టీకి మొత్తం 2,429 మంది ప్రతినిధులు ఉండగా, అధ్యక్ష అభ్యర్థిత్వం పొందటానికి 1,215 మంది మద్దతు కావాల్సి ఉంటుంది. ఇప్పటివరకు జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్‌నకు 244మంది ప్రతినిధుల మద్దతు లభించింది. మంగళవారం జరిగే ఓటింగ్‌లో ట్రంప్‌నకు 874 ఓట్లు వస్తే… అధ్యక్ష ఎన్నికల్లో ఆయన అభ్యర్థిత్వం ఖరారవుతుంది. రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్‌తో పోటీ పడుతున్న దక్షిణ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీకి 24 మంది మద్దతే ఉంది. అధ్యక్ష ఎన్నికల్లో ఆమె పోటీపడాలంటే…మంగళవారం జరిగే పోలింగ్‌లో 1,191 మంది ప్రతినిధులు మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. అద్భుతం జరిగితే తప్ప అంత మంది మద్దతు పొందటం సాధ్యం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.