“వినేష్ ఫోగాట్ను ముఖ్యమంత్రిని చేయండి”
Vinesh Phogat: ఒలింపిక్స్లో ఫైనల్స్ నుంచి డిస్క్వాలిఫై అయిన భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగాట్కు రాజ్యసభ సీటు కానీ.. భారతరత్న అవార్డుతో కానీ సత్కరించాలని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత అభిషేక్ బెనర్జీ డిమాండ్ చేసారు. వినేష్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కనీసం ఈ మాత్రం అన్నా చేయాలని.. ఆమెకు ఏ పతకం ఇచ్చినా తక్కువే అని బెనర్జీ ట్వీట్ చేసారు. దాంతో నెటిజన్లు ఆయన్ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఎంపీ సీటు భారత రత్న ఎందుకు సర్.. నేరుగా మీ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిని చేసేయండి ఓ పనై పోతుంది. ఆమేదో దేశానికి ప్రాణాలు అర్పించినట్లు మీరెందుకు తెగ ఫీలైపోతున్నారు అంటూ మండిపడుతున్నారు.