Smriti Irani: దరిద్రమైన ప్రశ్న అడిగిన నెటిజన్
Hyderabad: కేంద్రమంత్రి స్మృతి ఇరానీని (smriti irani) పట్టుకుని ఓ నెటిజన్ దరిద్రమైన ప్రశ్న అడిగాడు. అసలే ఆవిడకి కోపం ఎక్కువ. ఇలాంటి కామెంట్స్ చేసేవారిని అక్కడిక్కడ కడిగేయకుండా వదిలిపెట్టరు. అలాంటిది తన పర్సనల్ లైఫ్ని టచ్ చేస్తే ఊరుకుంటారా? ఇంతకీ ఆ నెటిజన్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే.. నిన్న స్మృతి తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్ పెట్టారు. అప్పుడు ఒక వ్యక్తి.. మేడమ్ మీరు మీ ఫ్రెండ్ భర్తని పెళ్లి చేసుకున్నారా? అని అడిగాడు.
దీనికి స్మృతి సమాధానం ఇస్తూ.. “” లేదండి. నా ఫ్రెండ్ మోనా నాకంటే 13 ఏళ్లు పెద్దది. కాబట్టి తనను నా చిన్ననాటి స్నేహితురాలు అని చెప్పలేను. మోనా నా ఇంట్లో మనిషి. తను పొలిటీషియన్ కాదు. అనవసరంగా తనని ఇలాంటి విషయాల్లోకి లాగొద్దు. కావాలంటే నాతో పోరాడండి, నన్ను ఇష్టం వచ్చినట్లుగా తిట్టుకోండి. అంతేకానీ సంబంధంలేని మనిషిని ఇందులోకి లాగొద్దు“” అని అన్నారు.
తన పర్సనల్ లైఫ్ గురించి ఎవరైనా ఏమైనా వాగితే ఊరుకోని స్మృతి (smriti irani) ఈ ఒక్క విషయంలో మాత్రం చాలా రిక్వెస్టింగ్గా సమాధానం చెప్పారు. ఎందుకంటే.. స్మృతి భర్త జుబిన్ ఇరానీకి ఆల్రెడీ మోనాతో వివాహం అయింది. వారిద్దరూ విడిపోవడంతో జుబిన్ను స్మృతి పెళ్లి చేసుకున్నారు. అయినప్పటికీ మోనాతో స్మృతి ఫ్రెండ్లీగానే ఉంటున్నారు.