Bypoll Results: ఖాతాలో చెరో మూడు గెలుపులు
ఏడు నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో BJP, ఇండియా (india) కూటములు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డాయి. మొత్తానికి ఈ రెండు వర్గాలు చెరో మూడు నియోజకవర్గాల్లో గలిచారు. మిగిలిన ఆ ఒక్క నియోజకవర్గంలో మాత్రం JMM (జార్ఖండ్ ముక్తి మోర్చా) పార్టీ గెలిచింది. (bypoll results)
BJP గెలిచినవి
త్రిపుర – బోక్సా నగర్ (తఫజ్జల్ హుస్సేన్)
త్రిపుర – ధన్పూర్ (బిందు దేబ్నాథ్)
ఉత్తరాఖండ్ – భాగేశ్వర్ (పార్వతి దాస్)
ఇండియా కూటమి గెలిచినవి
కేరళ – పుత్తుపల్లి (చాందీ ఊమెన్)
ఉత్తర్‌ప్రదేశ్ – ఘోసి (సుధాకర్ సింగ్)
వెస్ట్ బెంగాల్ – ధూప్‌గురి (నిర్మల్ చంద్ర రాయ్)
JMM గెలిచినది
జార్ఖండ్ – డుమ్రి (బేబీ దేవి)
ఇండియా కూటమికి మొదటి గెలుపు
ఈ ఉప ఎన్నికల ఇండియా కూటమికి (india bloc) మొదటి గెలుపుని ఇచ్చాయి. ఇక లోక్ సభ ఎన్నికల్లో (lok sabha elections) కూడా ఇదే విధంగా బరిలోకి దిగితే మాత్రం గెలుపు తథ్యం అనే చెప్పాలి. ఎందుకంటే.. కాంగ్రెస్ (congress) ఒంటరిగా పోటీ చేసి ఉంటే మాత్రం ఈ ఉప ఎన్నికల్లో కచ్చితంగా ఓడిపోయేదే. ఇప్పుడు ఇండియా కూటమి ఖాతాలో మూడు గెలుపులు ఉన్నాయంటే.. అందుకు కారణం ఇండియ కూటమిలో ఉన్న TMC, సమాజ్‌వాదీ పార్టీలే (samajwadi party) కారణం. ఈ రెండూ లేకపోయి ఉంటే కాంగ్రెస్‌కి ఒక్క గెలుపే దక్కి ఉండేది. (bypoll results)