Narendra Modi: జ‌గ‌న్ మావాడు అని ఎప్పుడూ అనుకోలేదు

narendra modi talks about ysrcp government

Narendra Modi:  వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని (Jagan Mohan Reddy) పార్టీని ఎప్పుడూ త‌మ మిత్ర‌ప‌క్షంగా భావించ‌లేద‌ని అన్నారు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ. ఈసారి ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి రాద‌ని తేల్చి చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడూ త‌మ మిత్ర‌ప‌క్షంగా చూడ‌లేద‌ని.. కానీ చాలా సందర్భాల్లో పార్ల‌మెంట్‌లో తాము ప్ర‌వేశ‌పెట్టిన బిల్లుల‌కు పార్టీ త‌మ‌కు తెలిపింద‌ని తెలిపారు.

తెలుగు దేశం, జ‌న‌సేన పార్టీల‌తో పొత్తులో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ అసెంబ్లీ సీట్ల‌తో పాటు ఎంపీ సీట్ల‌ను గెల‌వాల‌ని తీవ్రంగా కృషి చేస్తోంది. మ‌ళ్లీ రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి మెరుగుప‌డాలంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్డీయే కూట‌మి అధికారంలోకి రావాల‌ని మోదీ అభిప్రాయ‌ప‌డ్డారు. తానేమీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌పై స్పెష‌ల్ ఫోక‌స్ పెట్ట‌డంలేదని.. ఒక ప్ర‌ధానిగా భార‌త‌దేశంలోని అన్ని రాష్ట్రాల‌ను అభివృద్ధి చేయడం త‌న బాధ్య‌త అని తెలిపారు. ప్రాంతీయ పార్టీల మ‌ద్ద‌తు ఎప్పుడైతే త‌మ‌కు ఉంటాయో ఆ ప్రాంతాల్లో కూట‌మి గెలిచే వీలు ఉంటుంద‌ని తెలంగాణ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ప్రాంతీయ పార్టీతో త‌మ‌తో చేతులు క‌లిపితే అక్క‌డ కూడా త‌మ ప్ర‌భుత్వం ఏర్పాటు అయ్యే ఛాన్స్ ఉంద‌ని అన్నారు.