Nara Lokesh: వ‌ద్దు వ‌ద్దు నా కాళ్లు మొక్క‌ద్దు

narendra modi stops nara lokesh from touching his feet

Nara Lokesh: నేడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి, మంత్రుల ప్ర‌మాణ స్వీకారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న చోటుచేసుకుంది. నారా లోకేష్ మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసాక త‌న తండ్రి.. ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ త‌ర్వాత ప‌క్కనే ఉన్న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ గౌర‌వ సూచ‌కంగా లేచి లోకేష్‌ను అభినందించారు. అప్పుడు లోకేష్ మోదీ పాదాల‌కు నమ‌స్క‌రిస్తుండ‌గా మోదీ వ‌ద్దు వ‌ద్దు నా పాదాలు తాక‌ద్దు అని లోకేష్ చేతుల‌ను గ‌ట్టిగా పట్టుకున్నారు.