Narendra Modi: జాబిల్లిపై శివ శక్తి.. తిరంగా పాయింట్స్!
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (narendra modi) గ్రీస్ నుంచి నేరుగా బెంగళూరు చేరుకున్నారు. ఇస్రో (isro) చేపట్టిన ప్రతిష్ఠాత్మక చంద్రయాన్ 3 (chandrayaan 3) విజయం గురించి ఇస్రో శాస్త్రవేత్తల పనితనం గురించి ఈరోజు మీడియా ముందు మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. చంద్రయాన్ 3ని జాబిల్లిపై ల్యాండ్ అయిన రోజు అంటే ఆగస్ట్ 23ని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించారు. ఇక విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై ల్యాండ్ అయిన ప్రదేశాన్ని శివ శక్తి పాయింట్ (shiv shakti point) అని.. చంద్రయాన్ 2 జాబిల్లిపై పేలిపోయిన ప్రదేశాన్ని తిరంగా పాయింట్ (tiranga point) అని నామకరణం చేస్తున్నట్లు వెల్లడించారు.
“” చంద్రుడిపై ఏ దేశానికి చెందిన ల్యాండర్లను ల్యాండ్ చేసినా వాటికి పేరు పెట్టాల్సి ఉంటుంది. చంద్రయాన్ 2కి చెందిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై పేలిపోయినప్పుడు దానికి ఆ సమయంలో పేరు పెట్టడం కరెక్ట్ కాదు అనిపించింది. అందుకే ఇప్పుడు నామకరణం చేస్తున్నాను. మన దేశంలోని ప్రతి ఇంట్లో తిరంగా జెండా ఉన్నట్లు.. ఇక జాబిల్లిపై కూడా మన తిరంగా ఉంటుంది. ఈ ప్రతిష్ఠాత్మక చంద్రయాన్ 3 విజయం తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇండియా సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసింది “” అని తన స్పీచ్‌లో తెలిపారు మోదీ. (narendra modi)