Narendra Modi: ఆశీర్వాదం ఉంటే 2024లో మళ్లీ వస్తా
Delhi: ప్రజల ఆశీర్వాదం ఉంటే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో (lok sabha elections) గెలిచి మళ్లీ ప్రధాన మంత్రిగా ఎర్రకోటపై జెండా ఎగరవేయడానికి వస్తానని అన్నారు నరేంద్ర మోదీ (narendra modi). 77వ స్వాతంత్ర్య దినోత్సవం (independence day) సందర్భంగా ఆగ్రాలోని ఎర్ర కోటపై (red fort) జాతీయ జెండాను ఎగరవేసారు. ఆ తర్వాత పలు విషయాలపై ప్రసంగించారు.
ముందు మణిపూర్‌లో (manipur violence) ఆడవాళ్ల పట్ల జరుగుతున్న అఘాయిత్యాల గురించి మోదీ ప్రస్తావించారు. ఎందరో అమాయకులు చనిపోయారని, ఘర్షణలతో అల్లాడిపోతున్న మణిపూర్‌కు త్వరలో శాంతి లభిస్తుందని అన్నారు. భారత్ మణిపూర్‌తోనే ఉందని హామీ ఇచ్చారు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు తన కుటుంబ సభ్యులేనని మోదీ అన్నారు. BJP ట్రాక్ రికార్డ్ చూస్తే ఇండియా కోసం ఏం చేయడానికైనా సిద్ధమేనని ప్రజలకు అర్థమవుతుందని తెలిపారు. రానున్న ఐదేళ్లలో భారత్ మూడో అతిపెద్ద గ్లోబల్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే భాద్యత తనదేనని మోదీ అన్నారు. (narendra modi)
తమ పాలనలో ఇప్పటికే దేశంలోని 13.5 కోట్ల ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని, దేశం 100వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకునే రోజున అసలు పేదరికమే ఉండదని అన్నారు. అప్పటికి దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని తెలిపారు.