Narendra Modi: ఛత్రపతి శివాజీ నా దేవుడు.. ఆయన కాళ్ల మీద పడి క్షమాపణ అడుగుతాను
Narendra Modi: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోవడంపై ఆందోళన నెలకొంది. అంత పెద్ద విగ్రహాన్ని కనీసం మెయింటైన్ చేయకపోతే ఎలా అని అక్కడి ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడూ లేని విధంగా స్పందించారు. ఛత్రపతి శివాజీ తన దేవుడని.. ఆయన విగ్రహం కూలినందుకు కాళ్లపై పడి మరీ క్షమాపణలు అడుగుతానని అన్నారు. ప్రధాని స్థానంలో ఉన్న ఆయన ఒక విగ్రహం కూలిపోతే కాళ్ల మీద పడి క్షమాపణ అడగడం ఏంటి అని ప్రతిపక్ష పార్టీలు ముక్కున వేలేసుకుంటున్నాయి.
ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ శిందే కూడా కాస్త ఓవరాక్షన్ చేసారు. విగ్రహం కూలిపోయినందుకు శివాజీ అభిమానులకు కావాలంటే వంద సార్లు క్షమాపణలు చెప్తానని అన్నారు. మహారాష్ట్రలోని సింధూదుర్గ్ ప్రాంతంలోని ఓ కోటలో 35 అడుగుల శివాజీ విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు. ఏడాదిలోనే అది విరిగి కూలిపోవడం సంచనలంగా మారింది. అయితే.. విగ్రహం పొడవు కేవలం ఆరు అడుగులే ఉంచాలి అని చెప్తే అధికారుల మాటలు లెక్క చేయకుండా 35 అడుగులు నిర్మించారన్న ఆరోపణలు ఉన్నాయి