Narendra Modi: ఈ ప్రదేశంలో ఒక్క పెళ్లైనా చేసుకోండి ప్లీజ్.. ప్రధాని రిక్వెస్ట్
Narendra Modi: ఉత్తరాఖండ్‌లో ఒక్కసారైనా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేసారు ప్రధాని నరేంద్ర మోదీ. డెహ్రాడూన్‌లో జరుగుతున్న ఇన్‌వెస్టర్స్ సమ్మిట్‌లో (investors summit) ప్రధాని ఈ వ్యాఖ్యలు చేసారు. అయితే ఇటీవల మోదీ ఇదే డెస్టినేషన్ వెడ్డింగ్స్ గురించి కీలక వ్యాఖ్యలు చేసారు. మన భారతీయులు ఇక్కడి అందమైన ప్రదేశాలు వదిలేసి విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకుంటున్నారని ఆ అవసరం ఏముందని అన్నారు. అలాంటి ఆలోచనలు మానుకుని ఇండియాలోనే పెళ్లి చేసుకోవాలని సూచించారు. ఇప్పుడు డెహ్రాడూన్ ఇన్‌వెస్టర్స్ సమ్మిట్‌కి హాజరైన వివిధ దేశాలకు చెందిన పెట్టుబడిదారులతో మాత్రం భారత్‌లోని ఉత్తరాఖండ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని చెప్పారు.