Narendra Modi: ఆర్టిక‌ల్ 370పై సుప్రీం తీర్పు.. ప్ర‌ధాని ఏమంటున్నారు?

Narendra Modi: జ‌మ్మూ క‌శ్మీర్‌లో ఆర్టికల్ 370 (article 370) ర‌ద్దు చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం వేసిన పిటిష‌న్‌పై సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు వెల్ల‌డించింది. కేంద్ర ప్ర‌భుత్వం వేసిన పిటిష‌న్, వాద‌న‌ల‌ను సుప్రీంకోర్టు స‌మ‌ర్ధించింది. ఈ నేప‌థ్యంలో సుప్రీం తీర్పుపై ప్ర‌ధాని న‌రేంద్రమోదీ స్పందించారు. సుప్రీం ఇచ్చిన తీర్పు చ‌రిత్రాత్మ‌క‌మైన‌ద‌ని తెలిపారు. జ‌మ్మూ క‌శ్మీర్, ల‌ఢ‌క్ వాసుల‌కు ఇది ఒక ఆశ‌ను క‌లిగిస్తుంద‌ని వారి క‌ల‌లు సాకారం చేసేందుకు ప్ర‌భుత్వం అన్ని విధాలా స‌హ‌క‌రిస్తుంద‌ని పేర్కొన్నారు. అభివృద్ధి ఫ‌లాలు జ‌మ్మూ కాశ్మీర్, ల‌ఢాక్ వాసులకు లాభం క‌లిగించ‌డ‌మే కాకుండా ఆర్టిక‌ల్ 370 వ‌ల్ల క‌లిగిన న‌ష్టాల నుంచి కూడా బ‌య‌ట‌ప‌డేస్తుంద‌ని హామీ ఇచ్చారు. నేడు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు లీగ‌ల్ తీర్పు మాత్ర‌మే కాద‌ని ఇది జ‌మ్మూ కాశ్మీర్, ల‌ఢాక్ వాసుల‌కు ఓ ఆశాజ్యోతి లాంటిద‌ని వెల్ల‌డించారు.