Modi: BRS తెలంగాణ గౌర‌వాన్ని కాపాడలేక‌పోయింది

Narendra Modi: BRS తెలంగాణ గౌర‌వాన్ని కాపాడ‌లేక‌పోయింద‌ని అన్నారు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ. మాదిక (madiga) సంఘం హైద‌రాబాద్‌లో ఏర్పాటుచేసిన కార్యక్ర‌మంలో మోదీ పాల్గొన్నారు. ద‌ళితుడిని రాష్ట్ర‌ప‌తిని చేయ‌డం కాంగ్రెస్, BRSకు ఏమాత్రం ఇష్టంలేద‌ని.. మాదిగ‌ల‌కు తాను తోడుగా ఉంటాన‌ని అన్నారు.

ఏ రాజ‌కీయ పార్టీ మాదిగ‌ల బాధ‌ను అర్థంచేసుకోలేద‌ని ద‌ళితుడిని సీఎం చేస్తామ‌ని చెప్పి సీఎం KCR మోసం చేసార‌ని ఆరోపించారు. ద‌ళిత బంధు BRS కార్య‌క‌ర్త‌ల‌కు మాత్ర‌మే ఇస్తున్నార‌ని స్కీముల పేరుతో కేవ‌లం స్కాముల‌కు పాల్ప‌డుతున్నార‌ని విమ‌ర్శించారు. కొత్త రాజ్యం పేరుతో బాబా సాహెబ్ అంబేడ్క‌ర్‌ను అవ‌మానించార‌ని క‌నీసం ఆయ‌న విగ్ర‌హానికి కూడా నివాళులు అర్పించ‌లేద‌ని మోదీ విమ‌ర్శ‌లు గుప్పించారు. అంబేడ్క‌ర్‌ను వ్య‌తిరేకించి ఓడించిన కాంగ్రెస్ ఈరోజు నిస్సిగ్గుగా ఓట్లు అడుక్కుంటోంద‌ని ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ ఇత‌ర రాష్ట్రాల పార్టీలతో క‌లిసి మ‌రీ అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నాయ‌ని ఒక మంచి ప‌ని కోసం ఒక ప్ర‌భుత్వం మ‌రో ప్ర‌భుత్వంతో పొత్తు పెట్టుకోవాలి కానీ అవినీతికి పాల్ప‌డేందుకు పొత్తులు పెట్టుకోవ‌డం కాంగ్రెస్‌లోనే చూస్తున్నాన‌ని అన్నారు. BRS కాంగ్రెస్ ఒక్క‌టే. తెరవెనుక ఒకే ఆట ఆడుతున్నారు. ఆ రెండు పార్టీలు ఒక వైపు మ‌రో వైపు ఒంట‌రిగా పోరాడుతున్న BJP. త‌మ పార్టీలో సేవ చేయాల‌న్న సంక‌ల్పం ఉంద‌ని  తెలిపారు.