Narendra Modi: ప్రతిపక్షంగానే మిగిలిపోవాలని అనుకుంటున్నారు
Delhi: పేరులో ఇండియా ఉంటే సరిపోదంటూ అపోజిషన్ కూటమిపై సెటైర్ వేసారు ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi). ఇటీవల కాంగ్రెస్ (congress)…BJPని లోక్ సభ ఎన్నికల్లో (lok sabha elections) ఎలాగైనా ఓడించాలని BJP అంటే గిట్టని మరో 26 పార్టీలను కూటమిగా చేసి దానికి I-N-D-I-A అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. దీని గురించి మోదీ మాట్లాడుతూ.. ఈస్ట్ ఇండియా కంపెనీ పేరులో కూడా ఇండియా పదం ఉంది. ఇండియన్ ముజాయిద్దీన్‌లో కుడా ఇండియా అన్న పదం ఉంది. పేరులో ఇండియా ఉంటే సరిపోదు అని కామెంట్ చేసారని BJP నేత రవి శంకర్ ప్రసాద్ మీడియా ద్వారా వెల్లడించారు. BJP ప్రతి వారం నిర్వహించే మీటింగ్‌లో మోదీ ఇలా అన్నారని తెలిపారు.
“” తమ కూటమికి ఇండియా అని పేరు పెట్టేసామని తెగ సంబరపడిపోతున్నారు.ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, పీపుల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇండియన్ ముజాహిద్దీన్.. వీటన్నిటిలో ఇండియా అనే పదం ఉంది. కానీ జస్ట్ ఆ పదం ఉంటే సరిపోదు. దేశం పేరు పెట్టేసుకున్నంత మాత్రాన ప్రజలు నమ్మి ఓట్లు వేయరు. అపోజిషన్ కూటమికి ఎప్పుడూ ఒకే పని ఉంటుంది. మోదీని విమర్శించడం. వారి తీరు చూస్తుంటే అపోజిషన్‌గానే ఉండిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది “” అని విమర్శించారు మోదీ.